Site icon NTV Telugu

200MP అల్ట్రా-క్లియర్ కెమెరా, IP58/IP59 రేటింగ్స్, స్టైలిష్ డిజైన్‌తో HONOR Magic V Flip2 లగ్జరీ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లాంచ్!

Honor Magic V Flip2

Honor Magic V Flip2

HONOR Magic V Flip2: హానర్ తన తాజా ఫ్లిప్ ఫోన్ హానర్ మాజిక్ V ఫ్లిప్2 (HONOR Magic V Flip2) ను చైనాలో ఓ ప్రత్యేక ఈవెంట్‌లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.82 అంగుళాల FHD+ LTPO OLED స్క్రీన్‌తో వస్తోంది. ఇది 1-120Hz అడ్జెస్ట్బుల్ రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 4320Hz PWM డిమ్మింగ్ సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో AI సూపర్ డైనమిక్ డిస్‌ప్లే, AI ట్రూ కలర్ డిస్‌ప్లే, డాల్బీ విజన్ తోపాటు ZREAL ఫ్రేమ్ ఎంజాయ్ HD సర్టిఫికేషన్ వంటి ఫీచర్లతో వస్తోంది. మరి ఇన్ని ప్రిముమ్ ఫీచర్లున్న మొబైల్ పుతి వివరాలను చూసేద్దామా..

AI కెమెరా సిస్టమ్:
హానర్ మాజిక్ V ఫ్లిప్2లో 200MP అల్ట్రా-క్లియర్ AI మెయిన్ కెమెరా (OIS + EIS డ్యుయల్ స్టెబిలైజేషన్‌తో) ఉంటుంది. దీనితోపాటు 50MP 120° అల్ట్రా-వైడ్ మాక్రో లెన్స్, 50MP పోర్ట్రెయిట్ సెల్ఫీ కెమెరా కూడా అందుబాటులో ఉన్నాయి. దీనితో పోర్ట్రెయిట్ ఆల్గారిథమ్‌తో తీసిన సెల్ఫీలు ప్రొఫెషనల్ లుక్ ఇస్తాయి. ఇక సెల్ఫీ ఫోటోగ్రఫీ కోసం Ultra-Wide Portrait మోడ్, ఫిల్మ్-స్టైల్ ఫిల్టర్లు, 0.5x నుండి 3x వరకు ఐదు ఫోకల్ లెన్త్ ఆప్షన్లు ఉన్నాయి.

UP: యూపీలో దారుణం.. పెళ్లి ఒత్తిడి తేవడంతో మహిళను ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు

ఇక AI సూపర్ జూమ్ సాయంతో 30x టెలిఫోటో షూటింగ్ కూడా అందుబాటులో ఉంది. అలాగే, ఇందులో ఉండే AI ఇమేజ్ ఇంజిన్, AI ఎడిట్ ఫీచర్లు (AI పాసర్స్-బై ఎరేజర్, AI కటౌట్, AI రిఫ్లెక్షన్ రిమూవర్) వంటివి ఫోటో ఎడిటింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.

ఫ్యాషన్-ఫార్వర్డ్ డిజైన్:
ఈ కొత్త హానర్ మాజిక్ V ఫ్లిప్2 ప్రత్యేక ఎడిషన్‌ను ప్రొఫెసర్ జిమ్మీ చూ డిజైన్ చేశారు. ఇది నీలం రంగులో, నక్షత్రాల కాంతిని ప్రతిబింబించేలా డిజైన్ చేయబడింది. దీనితోపాటు ఈ మొబైల్ పర్పుల్, వైట్, గ్రే కలర్స్‌లో కూడా ఫోన్ లభ్యం అవుతుంది. ఈ ఫోన్‌ను లగ్జరీ యాక్సెసరీలా ఉపయోగించుకునేలా లెదర్ స్లింగ్ లేదా పెర్ల్ స్ట్రాప్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

కవర్ స్క్రీన్‌తో కొత్త ఇంటరాక్షన్:
ఈ ఫ్లిప్ ఫోన్‌ లోని కవర్ స్క్రీన్ కొత్త థీమ్స్, 9 రకాల పెట్స్ యానిమేషన్‌లు, ఎయిర్ జెస్చర్ సపోర్ట్ కలిగి ఉంది. అలాగే, AI స్మార్ట్ రిప్లై, AI ఇంటర్‌ప్రెటర్, మ్యాజిక్ క్యాప్సూల్, AI డీప్‌ఫేక్ డిటెక్షన్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

7,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Redmi Note 15 Pro+, Note 15 Pro స్మార్ట్ఫోన్స్ లాంచ్

పనితీరు, డ్యూరబిలిటీ:
హానర్ మాజిక్ V ఫ్లిప్2లో 50μm UTG కోటింగ్, టైటానియం అలాయ్ హింజ్ వాడబడింది. ఇది IP58/IP59 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. ఇందులో 5500mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ పవర్ ను ఇస్తుంది. ఐఓఎస్ డివైజ్‌లతో సులభంగా ఫైల్ ట్రాన్స్‌ఫర్ చేయగల ఫీచర్ కూడా ఇందులో ఉంది.

ధర, లభ్యత:
HONOR Magic V Flip2 పలు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. 12GB+256GB మోడల్ ధర 5499 యువాన్స్ (రూ.66,860), 12GB+512GB మోడల్ ధర 5999 యువాన్స్ (రూ.72,930), 12GB+1TB వేరియంట్ ధర 6499 యువాన్స్ (రూ.79,005)గా నిర్ణయించబడింది. ఇక, 16GB+1TB ప్రీమియం ఎడిషన్ ధర 7499 యువాన్స్ (రూ.91,160)గా ఉంది. ఈ ఫోన్ ప్రస్తుతం ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. చైనాలో ఆగస్టు 28వ తేదీ నుండి ఈ మొబైల్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

Exit mobile version