HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

Hmd Vibe 2 5g

Hmd Vibe 2 5g

HMD Vibe 2 5G New Variant Launched: HMD గ్లోబల్ సంస్థ తన వైబ్ (Vibe) సిరీస్‌లో భాగంగా HMD Vibe 2 5G స్మార్ట్‌ఫోన్‌కు కొత్త 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గత నెలలో కంపెనీ ఈ ఫోన్‌ను 4GB + 64GB, 4GB + 128GB వేరియంట్లలో లాంచ్ చేయగా.. వినియోగదారుల నుంచి భారీ డిమాండ్ రావడంతో ఇప్పుడు అధిక RAM కలిగిన కొత్త మోడల్‌ను మరోసారి లాంచ్ చేసింది.

కొత్త 6GB + 128GB వేరియంట్ జూన్ 16 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకలకు అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ అసలు ధర రూ.16,999 కాగా.. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా బ్యాంక్ డిస్కౌంట్లతో రూ.14,999 ప్రత్యేక ధరకు కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. మరోవైపు 4GB + 128GB వేరియంట్ ప్రస్తుతం రూ.12,999 ధరకు అందుబాటులో ఉంది. ఈ మొబైల్ 6.745 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చే ఈ స్క్రీన్ స్మూత్ స్క్రోలింగ్, మెరుగైన వీయింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అలాగే ఇది Unisoc T8200 6nm ప్రాసెసర్ కలిగి ఉండగా.. గ్రాఫిక్స్ కోసం Mali-G57 MC2 GPUను జత చేశారు.

×
×
Ad

స్టోరేజ్ పరంగా 64GB/128GB ఆప్షన్లు అందుబాటులో ఉండగా.. మైక్రోSD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. రెండు సంవత్సరాల పాటు త్రైమాసిక సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది.

భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌ను అందించగా.. ఇందులో 3.5mm ఆడియో జాక్, బాటమ్-ఫైరింగ్ స్పీకర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. IP64 రేటింగ్‌తో వచ్చే ఈ ఫోన్ దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణను అందిస్తుంది. కనెక్టివిటీ పరంగా 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.0, GPS, USB Type-C వంటి ఫీచర్లను అందించారు. ఫోన్‌లో 6000mAh భారీ బ్యాటరీ ఉండగా.. కేవలం 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు లభిస్తుంది.