Indian Govt: ఇక నుంచి ఆ యాప్స్ పని చేయవు.. ఈ రెండు యాప్స్‌పై బ్యాన్ విధించిన కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Govt: అప్పటి వరకు బాగానే నడుస్తున్న ఇ-రిక్షా (E-Rickshaw)లు ఒక్కసారిగా ఆగిపోయాయి. దీనికి కారణం కొంత మంది కేటుగాళ్లు చేస్తున్న చెత్త పని. ఇ-రిక్షాలను రన్నింగ్‌లో అకస్మాత్తుగా ఆపేస్తూ కొందరు చేసిన ప్రాంక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు ఇ-రిక్షా కార్మికులు, ప్రజల్లో ఆందోళన రేకెత్తించడంతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) రంగంలోకి దిగింది. ఈ వివాదానికి కారణమైన ‘BAT-BMS’, ‘Epoch Li-ion’ అనే రెండు మొబైల్ యాప్‌లపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని, వాటిని గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ల నుంచి పూర్తిగా తొలగించింది. నిజానికి ఈ వివాదం రేగడానికి చాలా కాలం ముందే ఈ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి ప్రధానంగా బ్యాటరీ డయాగ్నోస్టిక్స్ (పరీక్షించడం), మేనేజ్మెంట్ కోసం ఉద్దేశించినవి. ‘BAT-BMS’ అనేది మొదట ఎలాంటి హ్యాకింగ్ టూల్ కాదు. షెన్జెన్ గ్రీనెర్జీ టెక్నాలజీ (Shenzhen Grenergy Technology) అనే సంస్థ బ్లూటూత్ సదుపాయం ఉన్న లిథియం-అయాన్ బ్యాటరీల కోసం ఒక చట్టబద్ధమైన కంపానియన్ యాప్‌గా దీన్ని రూపొందించింది. బ్యాటరీ వోల్టేజ్, ఉష్ణోగ్రత (టెంపరేచర్), ఛార్జ్ సైకిల్స్ వంటి ఉపయోగకరమైన సమాచారాన్ని చూపించడం ఈ యాప్ ముఖ్య ఉద్దేశం. అంతేకాదు, అవసరమైనప్పుడు బ్యాటరీ మెయింటెనెన్స్ చేయడానికి, బ్యాటరీ డిస్ఛార్జ్ ఫంక్షన్‌ను పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయడానికి సైతం ఇది వినియోగదారులను అనుమతిస్తుంది.
అయితే, ఈ యాప్‌లో ఉన్న ఒక పెద్ద లోపం ఏంటంటే.. బ్లూటూత్ పరిధి అయిన 10 నుంచి 15 మీటర్ల దూరంలో ఉన్న ఎవరైనా సరే, ఎలాంటి పాస్వర్డ్ లేదా అథెంటికేషన్ లేకుండానే ఈ యాప్ ద్వారా నేరుగా బ్యాటరీకి కనెక్ట్ అవ్వొచ్చు. ఈ లూప్‌హోల్‌ను కొందరు ఆకతాయిలు తమ ప్రాంక్ వీడియోల కోసం వాడుకున్నారు. ప్రయాణంలో ఉన్న ఇ-రిక్షాల బ్లూటూత్‌కు కనెక్ట్ అయి, ఈ యాప్ సహాయంతో బ్యాటరీని డిస్ఛార్జ్ కాకుండా మధ్యలోనే ఆపేశారు. దీంతో డ్రైవర్లు వాహనం ఎందుకు ఆగిపోయిందో తెలియక గందరగోళానికి గురయ్యారు. ఈ వ్యవహారం ప్రయాణికుల భద్రతకు పెద్ద ముప్పుగా మారడంతో పాటు కనెక్టెడ్ వాహనాల్లో (Connected Vehicles) ఉన్న భద్రతా లోపాలను ఎత్తిచూపింది. ఈ క్రమంలో వేగంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం, ఇలాంటి రిస్కీ సాఫ్ట్వేర్లను మార్కెట్లోకి వదిలే ముందు మరింత కఠినమైన తనిఖీలు (సెక్యూరిటీ చెక్స్) నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి యాప్‌లు ప్లాట్‌ఫామ్‌లపైకి రాకుండా యాప్ రివ్యూ ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీదారులు కూడా తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. బ్లూటూత్ కనెక్టివిటీకి ప్రాపర్ అథెంటికేషన్ (పాస్వర్డ్ వంటివి) జోడించడం, బ్లూటూత్ ట్రాఫిక్‌ను ఎన్‌క్రిప్ట్ చేయడం, అనధికారిక యాక్సెస్‌ను నిరోధించేలా ఫర్మ్‌వేర్ అప్డేట్లను తీసుకురావడం వంటివి చేయాలని కోరుతున్నారు. భారతదేశంలో సరికొత్త ఈవీ టెక్నాలజీని వేగంగా అందుకోవాలనే రేసులో భద్రత వంటి ప్రాథమిక అంశాలను నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి గందరగోళం ఎదురవుతుందో ఈ ఘటన నిరూపించింది. సాంకేతికత దుర్వినియోగం కాకుండా సరైన చేతుల్లోనే ఉండేలా కఠిన నిబంధనలు తీసుకురావడమే ఇప్పుడున్న ఏకైక మార్గం.
Also Read
- Huawei Mate XT 2: హువావే మేట్ XT 2 ట్రై-ఫోల్డ్ 5G ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్.. 16GB RAM, 2TB స్టోరేజ్, 6000mAh బ్యాటరీ!
- OnePlus Ace 7 Pro: 200MP కెమెరా, 16GB RAMతో వన్‌ప్లస్ Ace 7 Pro.. ఫీచర్లు లీక్!
- Lenovo Yoga Tab Plus Gen 2: 12,700mAh బ్యాటరీ.. 4K 144Hz డిస్ప్లే.. లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ జెన్ 2 వచ్చేసింది
- Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!