Arm Cortex-M55 కోప్రాసెసర్, Gemini AI అసిస్టెంట్, హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లతో Google Pixel Watch 4 లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Pixel Watch 4: గూగుల్ (Google) సంస్థ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Google Pixel Watch 4ను అధికారికంగా భారత్ లో లాంచ్ చేసింది. ప్రీమియం స్మార్ట్‌వాచ్‌లలో ఇది ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పనుంది. గూగుల్ పిక్సెల్ (Pixel) ఎకోసిస్టమ్‌లో చేరిన ఈ సరికొత్త వాచ్ డిజైన్, అద్భుతమైన పనితీరు, ఆరోగ్య ట్రాకింగ్‌ల కలయికగా వినియోగదారులకు లభించనుంది. ఈ వాచ్ ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో ఆన్‌లైన్‌లో మాత్రమే లభిస్తుంది. రూ.39,990 ప్రారంభ ధరతో పాటు నో-కాస్ట్ ఈఎంఐ (EMI) ఆప్షన్‌లు, ఆరు నెలల కాంప్లిమెంటరీ ఫిట్‌బిట్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో ఇది లభించనుంది.
Vikarabad District : కుల్కచర్ల ఎమ్మార్వో ఆఫీస్ ముందు రైతుల ధర్నా !
Also Read
- Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
- MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ
- 144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
- 150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
Pixel Watch 4 డిజైన్ తోనే వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఇది వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా 41mm, 45mm అనే రెండు డయల్ సైజులలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ Snapdragon W5 Gen 2 చిప్‌సెట్, Arm Cortex-M55 కోప్రాసెసర్‌తో శక్తివంతంగా పనిచేసే ఈ వాచ్ మెరుపు వేగంతో పనితీరు, మెరుగైన మల్టీటాస్కింగ్ సామర్థ్యాన్ని పెంచుతుంది. యాప్‌లలో నావిగేట్ చేయడం నుండి నోటిఫికేషన్‌లను స్వీకరించడం వరకు ప్రతిది సున్నితంగా, త్వరగా జరుగుతుంది. ఈ వాచ్ కొత్త Actua 360 AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 3000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌తో అద్భుతమైన స్పష్టతను ఇస్తుంది. ఎడ్జ్-టు-ఎడ్జ్ Corning® Gorilla® Glass డిస్‌ప్లే స్క్రాచ్‌లకు నిరోధకతను అందిస్తుంది.
ఈ వాచ్ బ్యాటరీ పనితీరు మరో హైలైట్. 41mm వేరియంట్ 30 గంటల వరకు, 45mm మోడల్ 40 గంటల వరకు వినియోగాన్ని అందిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వడం వల్ల కొద్ది నిమిషాల్లోనే ఛార్జ్ చేసి ఎక్కువసేపు వాడుకోవచ్చు. IP68 రేటింగ్‌తో ఇది నీరు, ధూళికి నిరోధకతను కలిగి ఉంది. ఫిట్‌బిట్ ప్రీమియం ఇంటిగ్రేషన్ ద్వారా ఆరోగ్యం, ఫిట్‌నెస్ ఈ వాచ్ అనుభవంలో కీలక అంశాలుగా ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్ నిరంతర హృదయ స్పందన పర్యవేక్షణ, ECG, SpO₂, నిద్ర విశ్లేషణ, ఒత్తిడి నిర్వహణ వంటి అధునాతనలను అందిస్తుంది. AI ఆధారిత వెల్నెస్ ట్రాకింగ్‌తో పాటు వ్యక్తిగతీకరించిన వర్కౌట్ సిఫార్సులను, సంపూర్ణ ఆరోగ్య వివరాలను అందిస్తుంది.
Unboxing the new Pixel Watch 4 — on shelves now. pic.twitter.com/4WOt8SoQVF
— Google (@Google) October 13, 2025
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!