NTV Telugu Site icon

Google Pixel 6A: త్వరలో భారత్‌లోకి గూగుల్ పిక్సెల్ 6ఎ

Google Pixel 6a

Google Pixel 6a

టెక్నాలజీ రంగంలో రోజుకో మోడల్ స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతున్నాయి. మొబైల్ వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. గూగుల్ సరికొత్త ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేసింది.ఈ ప్మార్ట్ ఫోన్ యూత్ కి బాగా నచ్చుతుందని గూగుల్ చెబుతోంది. అత్యాధునిక ఫీచర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ యువత చేతుల్లోకి రానుంది.

గూగుల్ పిక్సెల్‌ 6ఏ (Google Pixel 6a) ఫీచర్లు

గూగుల్ పిక్సెల్‌ 6ఏ (Google Pixel 6a) మొబైల్ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. ఈ స్మార్ట్ ఫోన్లో అనేక స్పెసిఫికేషన్లు వున్నాయి. త్వరలోనే భారత సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లో పిక్సెల్‌ 6ఏను విడుదల చేయనున్నట్లు గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. దీని ధర సుమారు భారతీయ కరెన్సీలో రూ.35 వేలు.

*ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌ ఆపరేషన్
* 60 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే
*కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్
*ఆక్టాకోర్‌, గూగుల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన టెన్సర్‌ ప్రాసెసర్‌
*ఫోన్‌ భద్రత కోసం టైటాన్‌ ఎమ్‌2 సెక్యూరిటీ ప్రాసెసర్‌
* మొత్తం మూడు కెమెరాలు
* వెనుక రెండు, ముందు ఒక కెమెరా
* వెనకువైపు రెండు 12 ఎంపీ కెమెరాలు, వీడియో కాలింగ్
* సెల్ఫీల కోసం ముందు 8 ఎంపీ కెమెరా
* వెనుకవైపు కెమెరాలతో 4K క్వాలిటీ వీడియో రికార్డింగ్
* 4,410 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్‌
* 6 జీబీ ర్యామ్‌/128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్
* అమెరికన్‌ మార్కెట్లో ధర 449 డాలర్లు.. ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.35వేలు
* జూన్‌లో బుకింగ్స్ ప్రారంభం..

Technology: యూజర్లకు క్షమాపణలు చెప్పిన శాంసంగ్, వన్‌ప్లస్