NTV Telugu Site icon

Play Store : ఆ యాప్‌లకు వార్నింగ్‌ ఇచ్చిన గూగుల్‌, యాపిల్

Play Store

Play Store

గూగుల్ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌లలో లక్షల కొలది యాప్‌ పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే.. ప్రజలకు ఉపయోగకరంగా లేని, ఆప్డేట్‌లో లేని యాప్‌లను తొలగించేందుకు గూగుల్‌, యాపిల్ లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో చాలా రోజుల నుంచి అప్డేట్‌ చేయని యాప్‌లను అప్డేట్‌ చేయాలంటూ సంబంధిత సంస్థలకు గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌లు ఇప్పటికీ సూచించాయి.

అయితే.. ఈ క్రమంలో.. గూగుల్ ప్లే స్టోర్‌లో దాదాపు 8.69లక్షల ఆండ్రాయిడ్, యాపిల్ యాప్‌ స్టోర్‌లో సుమారు 6.50లక్షల ఐఓఎస్ యాప్స్ త్వరలో మాయం కానున్నట్టు సమాచారం. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్‌ స్టోర్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి 15లక్షల యాప్స్ తొలగించే అవకాశం ఉందని తాజాగా పిక్సెలేట్ రిపోర్ట్ వెల్లడించింది. దీంతో యాపిల్ యాప్‌ స్టోర్‌లోని దాదాపు 30శాతం యాప్స్ తొలగించబడుతాయని అంచనా వేసింది.

2 సంవత్సరాలుగా అప్డేట్‌ చేయని యాప్స్‌ను అబాండోన్డ్‌గా పరిగణించి తొలగించేందుకు గూగుల్, యాపిల్ సిద్దమయ్యాయని, ఇందులో ఎక్కువగా ఎడ్యుకేషన్, గేమ్స్‌, రిఫరెన్స్ లాంటి కేటగిరీలకు చెందిన యాప్స్ ఉన్నాయని తెలుస్తోంది. కాగా, 2 ప్లాట్‌ఫామ్‌ల్లో కలిపి 3.14లక్షల సూపర్ అబాండోన్డ్ యాప్స్ ఉన్నాయని పిక్సెలేట్ పేర్కొంది. అంటే 5 సంవత్సరాల నుంచి ఎలాంటి అప్డేట్‌ లేని యాప్స్ ఇవి.

యాప్‌ స్టోర్‌లో 1.84లక్షలు, గూగుల్ ప్లే స్టోర్‌లో 1.3లక్షలు ఇలాంటి యాప్స్ ఉన్నట్లు పిక్సెలేట్ రిపోర్ట్ తెలిపింది. అయితే.. యాప్స్‌ అప్డేట్‌ చేయకపోతే.. ఈ యాప్స్‌ వాడే వారి పర్సనల్‌ డాటా హ్యాకర్స్‌ చేతిలో పడే అవకాశం ఉన్న నేపథ్యంలో గూగుల్‌, ఐఓఎస్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.