Site icon NTV Telugu

Samsung History: ఏంటి! శాంసంగ్ కంపెనీ మొదట్లో ఎండు చేపలు అమ్మిందా..? సంచలన విషయాలు…

Samsung

Samsung

శాంసంగ్ పేరు వినగానే మీ మదిలో ఏ ఫొటో వస్తుంది..? మొబైల్ ఫోన్, ఫ్రిజ్, టీవీ, గృహోపకరణాల కనిపిస్తాయి. కానీ.. ఈ కంపెనీ మొదట్లో ఏం చేసేది? అనే విషయం తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. శాంసంగ్ మార్చి 1, 1938న ప్రారంభమైంది. దాని వ్యవస్థాపకుడు లీ బైయుంగ్-చుల్. దక్షిణ కొరియాలోని డేగు నగరంలో ప్రారంభమైన కంపెనీ.. మొదట్లో ఎండిన చేపలు, పండ్లు, నూడుల్స్ విక్రయించే దుకాణాన్ని ప్రారంభించారు. అనంతరం రవాణా, రియల్ ఎస్టేట్, బీమా, బ్రూయింగ్ వంటి రంగాలలో విస్తరించింది.

READ MORE: Chicken: ఎక్స్‌ట్రా “చికెన్” కావాలన్నందుకు ఫ్రెండ్‌నే చంపేశాడు..

1938లో దక్షిణ కొరియాలో లీ బైంగ్-చుల్ స్థాపించిన ఈ సంస్థ, మొదట్లో తన వ్యాపారాన్ని ఎండు చేపలు, కిరాణా సామాగ్రి, నూడుల్స్ అమ్మకాలతో ప్రారంభించింది. అయితే, కాలక్రమేణా శామ్సంగ్ తన వ్యాపార మార్గాన్ని మార్చుకుంది. 1969 నుంచి ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలోకి ప్రవేశించి, రేడియోలు, టెలివిజన్లు, గృహోపకరణాలు, టెలికమ్యూనికేషన్ ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించింది. మొదట్లో ఎండు చేపల వ్యాపారం చేసినప్పటికీ.. కాలక్రమేణా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీగా ఎదిగింది. 1987లో మరణించే వరకు లీ బైంగ్-చుల్ కంపెనీకి నాయకత్వం వహించారు. ఇప్పుడు మనవరాళ్ళు ప్రొఫెషనల్ మేనేజర్‌లతో కలిసి శామ్‌సంగ్ గ్రూప్‌ను నిర్వహిస్తున్నారు.

READ MORE: Pilot Project: ఏపీలో మరో పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం.. 10 నిమిషాల్లో పని పూర్తి!

ఇదిలా ఉండగా.. తాజాగా శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల శ్రేణిని కంపెనీ అధికారికంగా విడుదల చేసింది. ఈ లైనప్‌లో ‘గెలాక్సీ Z ఫోల్డ్7’, ‘గెలాక్సీ Z ఫ్లిప్7’, ‘గెలాక్సీ Z ఫ్లిప్7 FE’ ఉన్నాయి. కంపెనీ తన ‘గెలాక్సీ అన్​ప్యాక్డ్ ఈవెంట్’​లో వీటిని ఆవిష్కరించింది. గతేడాది విడుదల చేసిన ‘గెలాక్సీ Z ఫోల్డ్‌ 6’, ‘Z ఫ్లిప్‌ 6’కు కొనసాగింపుగా వీటిని ప్రారంభించింది. అయితే ఈసారి వీటిని మరింత స్లిమ్‌ డిజైన్‌లో తీసుకొచ్చింది. భారత మార్కెట్​లో వీటి ధరలను ప్రకటించడంతో పాటు ప్రీ-బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. ‘గెలాక్సీ Z ఫోల్డ్7’ రూ.1,74,999 నుంచి ప్రారంభమవుతుంది. ‘గెలాక్సీ Z ఫ్లిప్7’ రూ.1,09,999 నుంచి ప్రారంభమవుతుంది. మరింత సరసమైన ‘గెలాక్సీ Z ఫ్లిప్7 FE’ ధర రూ.89,999 నుంచి లభిస్తుంది.

Exit mobile version