Site icon NTV Telugu

Nothing Offers: Flipkart Big Billion Days 2025లో నథింగ్ ఫోన్ 3a, CMF ఫోన్ 2 ప్రో, నథింగ్ ఇయర్‌పై భారీ ఆఫర్స్!

Flipkart Big Billion Days 2025 Nothing

Flipkart Big Billion Days 2025 Nothing

Nothing Offers: Flipkart Big Billion Days 2025లో నథింగ్ ఫోన్ 3a, CMF ఫోన్ 2 ప్రో, నథింగ్ ఇయర్‌పై భారీ ఆఫర్స్!

ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ సంవత్సరంలోనే అతిపెద్ద సేల్ అయిన బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025ను సెప్టెంబర్ 23న ప్రారంభించనుంది. ఈ సేల్ లో వివిధ రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ లు వాటి సాధారణ మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకు లభించనున్నాయి. ఈ సేల్ కు ముందుగానే నథింగ్ (Nothing)సంస్థ తన ఉత్పత్తులైన ఫోన్ 3a ప్రో, CMF ఫోన్ 2 ప్రో, నథింగ్ ఇయర్, ఇతర వాటిపై అందించే ఆఫర్లను ప్రకటించింది.

Country With Zero Muslim Population: ప్రపంచంలో ఒక్క ముస్లిం కూడా లేని ఏకైక దేశం ఏదో తెలుసా..?

నథింగ్ స్మార్ట్ ఫోన్ లపై డీల్స్:
బిగ్ బిలియన్ డేస్ సేల్, నథింగ్ ఫోన్ 3a, ఫోన్ 3a ప్రో స్మార్ట్ ఫోన్లు వాటి ప్రారంభ ధరలు రూ. 22,999, రూ. 27,999 ల కంటే.. రూ.2000ల ఆఫర్ తో వరుసగా రూ. 20,999, రూ. 24,999లకు లభిస్తాయి. అదేవిధంగా, CMF ఫోన్ 2 ప్రో బేస్ వేరియంట్ 8GB + 128GB ధర రూ. 18,999 నుండి కేవలం రూ. 14,999కి అందుబాటులో ఉంటుంది.

వీటితోపాటు నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2 వినియోగదారుల కోసం ఒక ప్రత్యేక అప్ గ్రేడ్ కార్యక్రమాన్ని కూడా కంపెనీ ప్రకటించింది. పాత ఫోన్ ను అప్ గ్రేడ్ చేయాలనుకునే వినియోగదారులు తాజా నథింగ్ ఫోన్ 3ని కేవలం రూ. 34,999కి పొందవచ్చు. ఈ ఫోన్ జూలైలో రూ. 79,999 ప్రారంభ ధరతో మార్కెట్ లోకి వచ్చింది. నథింగ్ ఫోన్ 1కి తాజా ఆండ్రాయిడ్ అప్ డేట్లు లభించవని కంపెనీ ధ్రువీకరించిన నేపథ్యంలో ఈ అప్ గ్రేడ్ ఆఫర్ ఉపయోగపడనుంది.

Flipkart Big Billion Days 2025: Motorola స్మార్ట్‌ఫోన్లు, ఇయర్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్స్‌పై భారీ తగ్గింపు..!

ఇక నథింగ్ కంపెనీ తన ట్రూ వైర్ లెస్ స్టీరియో (TWS) ఇయర్ ఫోన్ లపై కూడా ఆఫర్లను ప్రకటించింది. గత ఏడాది రూ. 11,999, రూ. 7,999 ధరలతో లాంచ్ అయిన నథింగ్ ఇయర్, ఇయర్ (a) మోడల్స్ ఈ సేల్ లో కేవలం రూ. 7,499, రూ. 4,499కి లభించనున్నాయి. వీటితో పాటు ఇటీవల విడుదలైన నథింగ్ ఇయర్ ఓపెన్ రూ. 9,999కి, CMF బడ్స్ ప్రో 2 రూ. 3,199కి కొనుగోలు చేయవచ్చు. వీటితోపాటు, CMF వాచ్ ప్రో 2 అసలు ధర రూ. 4,999 కాగా వాటిని కేవలం సేల్ లో రూ. 3,999కి కొనుగోలు చేయవచ్చు.

Exit mobile version