Site icon NTV Telugu

Nothing నుంచి సర్ప్రైజ్.. ట్రిపుల్ కెమెరా, మెటల్ ఫ్రేమ్ తో రాబోతున్న CMF Phone 3 Pro..!

Cmf Phone 3 Pro

Cmf Phone 3 Pro

CMF Phone 3 Pro Leaks: గత ఏడాది విడుదలైన CMF Phone 2 Pro తర్వాత.. దాని అప్డేటెడ్ స్మార్ట్‌ఫోన్ అయిన CMF Phone 3 Pro ను విడుదల చేసేందుకు హావిడి మొదలు పెట్టింది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని కీలక స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీక్ అవుతున్నాయి. లీక్ వివరాల ప్రకారం ఈ ఫోన్‌లో FHD+ (2392 x 1080 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లే కొనసాగుతుంది. అయితే ప్రధాన మార్పు ప్రాసెసర్ విషయంలో ఉంది. గత మోడల్‌లో ఉన్న మీడియాటెక్ డిమెంసిటీ 7300 ప్రో చిప్‌సెట్ స్థానంలో ఈసారి స్నాప్ డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌ను తీసుకరానుంది. ఇదే చిప్‌ ను కంపెనీ Nothing Phone (4a)లో కూడా ఉపయోగించింది.

Love Insurance Kompany Review: లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రివ్యూ

ఈ రాబోయే కొత్త మొబైల్ లో బ్యాటరీ సంబంధించి కూడా స్వల్ప మెరుగుదల కనిపించనుంది. CMF Phone 3 Proలో 5,400 నుంచి 5,500 mAh సామర్థ్యం గల బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఇది ముందు మోడల్‌లో ఉన్న 5,000 mAh బ్యాటరీ కంటే కాస్త ఎక్కువ. అంతేకాదు ఛార్జింగ్ స్పీడ్ కూడా పెరిగి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించనుంది. ఇది గతంలో 33W గా ఉంది.

Hyderabad Police: ‘రీల్’ కోసం ‘రియల్’ గౌరవం కోల్పోకండి.. వారికి హైదరాబాద్ పోలీస్ స్ట్రాంగ్ వార్నింగ్

డిజైన్ పరంగా కూడా ఈ ఫోన్‌ లో కీలక మార్పులు ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా ప్లాస్టిక్ ఫ్రేమ్‌కు బదులుగా మెటల్ ఫ్రేమ్ తీసుకురానున్నారు. సాధారణంగా మిడ్-రేంజ్ ఫోన్లలో మెటల్ ఫ్రేమ్ అరుదుగా కనిపిస్తుంది. కెమెరా సెటప్ విషయానికి వస్తే ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ కొనసాగుతుందని తెలుస్తోంది. అయితే మూడో కెమెరా పొజిషన్ కొంచెం మారి, ఎడమ వైపు ఉన్న రెండు వెర్టికల్ కెమెరాల నుండి కొంత దూరంలో ఉంచనున్నారు. ఈ CMF Phone 3 Pro ఈ 2026 రెండో త్రైమాసికంలో (Q2) అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు రాబోయే కొద్దీ రోజుల్లో బయటకు వచ్చే అవకాశముంది.

Exit mobile version