BSNL: ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) విద్యార్థులు, మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ప్లాన్‌లను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు CMD ఏ. రాబర్ట్ జె. రవి వెల్లడించారు. ఈ ప్రకటనతో పాటు బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థుల కోసం ప్రత్యేక స్టూడెంట్ స్పెషల్ ప్లాన్‌ను కంపెనీ ఇప్పటికే మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. విద్యార్థులను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ BSNL Student Special Plan పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉండనుంది. రోజుకు కేవలం రూ. 8.96 (రూ.251/28 రోజులు) వ్యయంతోనే పూర్తి స్థాయి వాయిస్ కాలింగ్, డేటా, SMS సేవలను అందించడం ఈ ప్లాన్ ప్రత్యేకత.
GlobeTrotter : ‘వారణాసి’ ఈవెంట్ ఎఫెక్ట్.. ఎస్ఎస్ రాజమౌళి పై పోలీసులకు ఫిర్యాదు
ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు 100GB హై-స్పీడ్ డేటా, రోజుకు 100 SMSలు లభిస్తాయి. ఈ ప్లాన్‌ను నవంబర్ 14 నుంచి డిసెంబర్ 13, 2025 వరకు యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇది కేవలం కొత్త వినియోగదారులకే పరిమితం కాకుండా అందరికీ అందుబాటులో ఉండడం మరో సానుకూల అంశం. కస్టమర్లు సమీపంలోని BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను సందర్శించడం ద్వారా, లేదా 1800-180-1503కు కాల్ చేయడం ద్వారా లేదా బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ ప్లాన్‌ను సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా BSNL స్వదేశీ టెక్నాలజీ ఆధారంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక 4G మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ ప్లాన్‌ను విడుదల చేసినట్లు CMD తెలిపారు. భారతదేశం 4G మొబైల్ నెట్‌వర్క్ టెక్నాలజీని స్వయంగా అభివృద్ధి చేసిన ప్రపంచంలో ఐదవ దేశమని, ఈ టెక్నాలజీని BSNL చాలా కాలంగా అభివృద్ధి చేసి ఇప్పుడు జాతీయస్థాయిలో విజయవంతంగా అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్లాన్ ద్వారా విద్యార్థులు మొత్తం 28 రోజుల పాటు 100GB వరకు డేటాను వినియోగించి, దేశీయంగా అభివృద్ధి చేసిన ఆధునిక 4G నెట్‌వర్క్‌ను ప్రత్యక్షంగా అనుభవించే అరుదైన అవకాశం లభిస్తుందని ఆయన అన్నారు. విద్యార్థుల అకడమిక్ అవసరాల కోసం అధిక డేటా అవసరమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, తక్కువ ధరలో భారీ డేటా ప్యాక్‌లు అందిస్తున్న ఈ BSNL స్టూడెంట్ స్పెషల్ ప్లాన్ నిజంగా బడ్జెట్-ఫ్రెండ్లీ ఆఫర్‌గా నిలుస్తోంది.
Study, Stream, Succeed with #BSNL !
Get BSNL’s Student Special Plan @ ₹251 with Unlimited Calls, 100GB Data & 100 SMS/Day. Offer valid till 14 Dec, 2025. #BSNLLearnersPlan #DigitalIndia #ConnectingBharat pic.twitter.com/GNb3PclKGu
— BSNL India (@BSNLCorporate) November 15, 2025
