నేటి ఆధునిక కాలంలో స్మార్ట్‌వాచ్‌లు కేవలం సమయం చూసుకోవడానికో లేదా ఫోన్ కాల్స్ మాట్లాడటానికో మాత్రమే పరిమితం కావడం లేదు. సాంకేతికతను మరింత ముందుకు తీసుకెళ్తూ, ప్రముఖ భారతీయ బ్రాండ్ బోట్ (boAt) సరికొత్త విప్లవాత్మక ఫీచర్‌తో boAt Wave Fortune స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ వాచ్ అతిపెద్ద ప్రత్యేకత దీనిలోని NFC (Near Field Communication) సదుపాయం. బోట్ సంస్థ యాక్సిస్ బ్యాంక్ , మాస్టర్ కార్డ్‌తో జతకట్టి ‘ట్యాప్ అండ్ పే’ (Tap & Pay) ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల జేబులో వాలెట్ లేదా చేతిలో ఫోన్ లేకపోయినా, కేవలం మీ మణికట్టుపై ఉన్న వాచ్‌ను పీఓఎస్ (POS) మెషీన్ దగ్గర ట్యాప్ చేయడం ద్వారా రూ. 5,000 వరకు సులభంగా చెల్లింపులు చేయవచ్చు.
వన్ ప్లస్ ధమాకా ఆఫర్.. 7100mAh బ్యాటరీతో రానున్న కొత్త ఫోన్.. రూ. 25 వేలకే.!
ఈ వాచ్ కేవలం పేమెంట్స్ కోసమే కాకుండా, అద్భుతమైన డిస్ప్లే , డిజైన్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇందులో 1.96 ఇంచుల పెద్ద HD డిస్ప్లే ఉండగా, 550 నిట్స్ బ్రైట్నెస్ కారణంగా ఎండలో కూడా నోటిఫికేషన్లు ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి. స్టైలిష్ లుక్ కోసం ఇందులో మెటాలిక్ బాడీని అందించారు. కమ్యూనికేషన్ విషయానికి వస్తే, బ్లూటూత్ v5.3 కనెక్టివిటీతో మెరుగైన కాలింగ్ అనుభూతినిస్తుంది. ఇందులో ఇంటరాక్టివ్ డయల్ ప్యాడ్ , కాంటాక్ట్ సేవింగ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, గూగుల్ అసిస్టెంట్ లేదా సిరి వంటి AI వాయిస్ అసిస్టెంట్లను కూడా నేరుగా వాచ్ నుంచే ఆపరేట్ చేసే వెసులుబాటు ఉంది.
ఆరోగ్యం , ఫిట్నెస్ పట్ల శ్రద్ధ చూపే వారి కోసం ఇందులో ఏకంగా 700 కంటే ఎక్కువ యాక్టివ్ స్పోర్ట్స్ మోడ్స్‌ను చేర్చారు. హార్ట్ రేట్ మానిటర్, SpO2 (బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్), స్లీప్ ట్రాకర్ , మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ప్రత్యేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. బ్యాటరీ విషయానికొస్తే, ఒక్కసారి ఛార్జ్ చేస్తే సాధారణ వినియోగంలో 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఇది IP68 రేటింగ్‌తో రావడం వల్ల దుమ్ము , నీటి నుండి కూడా రక్షణ ఉంటుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌వాచ్ లాంచ్ ఆఫర్ కింద ప్రముఖ ఈ-కామర్స్ సైట్లలో రూ. 2,599 ధరకే లభిస్తోంది. బడ్జెట్ ధరలో అత్యంత ఆధునికమైన NFC పేమెంట్ సదుపాయం , కాలింగ్ ఫీచర్లు కోరుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక.
Pakistan: “అవును, నూర్ఖాన్ ఎయిర్‌బేస్‌పై భారత్ దాడి చేసింది”.. అంగీకరించిన పాకిస్తాన్..