NTV Telugu Site icon

Jio: జియో కస్టమర్లకు షాక్.. భారీగా పెరిగిన రీఛార్జి ధరలు

Jip

Jip

రిలయన్స్ జియో కస్టమర్లకు ఇది పెద్ద షాకింగ్ వార్త. జియో (Jio) తన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను భారీగా పెంచింది. ప్రస్తుతం ఉన్న కనిష్ట నెలవారి ప్రీపెయిడ్ ప్లాన్ ను రూ.155 నుంచి రూ.189కి పెంచింది. ప్లాన్ ను బట్టి ఈ పెంపు కనిష్టంగా రూ. 34 నుంచి గరిష్టంగా రూ.600 వరకు పెంచింది. మరోవైపు 1 జీబీ డేటా యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జి ధరను రూ.15 నుంచి రూ.19కి పెంచింది. అలాగే.. జియో రూ. 209 ప్రీపెయిడ్ ప్లాన్ ధర ఇప్పుడు రూ. 249 అయింది. దాని వాలిడిటీ 28 రోజులు ఉంటుంది. రూ.239 ప్లాన్ ఇప్పుడు రూ.299గా మారింది. దీని వాలిడిటీ 28 రోజులు ఉంటుంది.

Read Also: Upcoming Pan India Films: కల్కి తర్వాత రానున్న పాన్‌ ఇండియా చిత్రాలు ఇవే..

వీటితో పాటు కొత్తగా రిలయన్స్ జియో పలు సర్వీసులు ప్రారంభించింది. జియో సేఫ్, జియో ట్రాన్స్ లేట్. క్వాంటం సెక్యూర్ కమ్యూనికేసన్ ఆప్ పర్ కాలింగ్, మెసేజింగ్, ఫైల్ ట్రాన్స్ ఫర్ తదితరాల కోసం రూ.199 చెల్లించాలి. జియో ట్రాన్స్ లేట్ అంటే బహుళ భాషా కమ్యూనికేషన్ యాప్, వాయిస్ కాల్, వాయిస్ మెసేజ్, టెక్ట్స్, ఇమేజ్ ట్రాన్స్ లేషన్ కోసం నెలకు రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. కాగా.. ఈ ధరలు జూలై 3 నుండి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఇక ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రీ-పెయిడ్ ప్లాన్లపై సరాసరి 20 శాతం ధరలు పెంచింది. రెండున్నరేండ్ల తర్వాత రిలయన్స్ జియో టారిఫ్ ధరలు పెంచడం ఇదే తొలిసారి. జియో కొత్తగా 19 ప్లాన్లు ప్రకటిస్తే.. వాటిలో 17 ప్రీపెయిడ్ ప్లాన్లు, రెండు పోస్ట్ పెయిడ్ ప్లాన్లు ఉన్నాయి.