Best Budget Smartphones: రక్షా బంధన్ నాడు సోదరీమణులకు ఏ గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ బెస్ట్ బడ్జెట్ ఫోన్స్ ట్రై చేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Best Budget Smartphones: ప్రతి ఏడాది రాఖీ పండుగ రాగానే అక్కతమ్ముడు, అన్నచెల్లెళ్ల మధ్య ప్రేమ, బంధం మరింత బలపడుతుంది. ఈ ప్రత్యేక రోజున మీ సోదరి కోసం ఒక విలువైన, ఉపయోగకరమైన గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారా? అలాంటప్పుడు ఒక మంచి స్మార్ట్‌ఫోన్ కంటే మంచి ఎంపిక మరొకటి ఉండదు. కాబట్టి ఈ రాఖీ పండుగను మరింత అందంగా మార్చడానికి, మీ చెల్లెలు కోసం బడ్జెట్‌కు అనుగుణంగా ఉన్న ఉత్తమ మొబైల్స్‌ను గిఫ్ట్ చేయండి. చదువు, ఎంటర్టైన్మెంట్, సోషల్ మీడియా, వీడియో కాల్స్ అన్ని అవసరాలకు పనికొచ్చేలా ఈ ఫోన్లను ఇవ్వడానికి ట్రై చేయండి. స్టైలిష్ డిజైన్‌తో పాటు మంచి కెమెరా, లాంగ్ బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లతో మీ గిఫ్ట్ మరపురాని గుర్తుగా మిగిలిపోతుంది. మరి 10,000 లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ మొబైల్స్ వివరాలు ఒకసారి చూసేద్దామా..
Samsung Galaxy S25 FE: విడుదలకు ముందే ఫీచర్లు లీక్.. పవర్ఫుల్ ఫీచర్లతో బడ్జెట్ ఫ్లాగ్షిప్ మొబైల్!
Also Read
- క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
- Low Cost Smartphones: రూ.9,999కే 5జీ స్మార్ట్ ఫోన్స్.. 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో మార్కెట్లో లాంచ్..
- Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్‌గా మార్చేసే సింపుల్ ట్రిక్
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
Realme Narzo N53:
ఈ ఫోన్ 6.74 అంగుళాల HD+ డిస్ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఇందులో Unisoc T612 ప్రాసెసర్ ఉండటం వల్ల డే టు డే యూజ్‌కు మంచి పనితీరు ఇస్తుంది. 4GB/6GB ర్యామ్, 64GB/128GB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 50MP వెనుక కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాతో ఫోటో క్వాలిటీ బాగుంటుంది. 5000mAh బ్యాటరీతో పాటు 33W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా కలదు. దీని ధర రూ.8,999 మాత్రమే. ఈ ఫోన్ స్టైలిష్ డిజైన్, వేగవంతమైన ఛార్జింగ్, డైలీ యూజ్‌కి బాగా పనికొచ్చేలా ఉంటుంది.
Infinix Smart 8 Plus:
ఈ ఫోన్ మెడియాటెక్ Helio G36 ప్రాసెసర్‌తో వస్తుంది. 4GB ఫిజికల్ RAMతో పాటు 4GB వర్చువల్ RAM సపోర్ట్ ఉంటుంది. అలాగే 6.6 అంగుళాల HD+ డిస్ప్లేలో 90Hz రిఫ్రెష్ రేట్ ఉంది. కెమెరా విభాగంలో 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అలాగే ఇందులో భారీగా 6000mAh బ్యాటరీతో 18W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. దీని ధర 6,999 నుండి 7,499 మధ్యలో ఉంటుంది. ఈ ఫోన్ ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ కోసం చూస్తున్నవారికి, స్టూడెంట్స్‌కి పర్ఫెక్ట్ ఆప్షన్.
Fake ED Officers: ఈడీ అధికారుల దారి దోపిడీ.. 70 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు..

Lava Blaze 5G:
సాదారణంగా 5G ఫోన్లు ఈ ధరకు దొరకడం చాలా కష్టం. కానీ Lava Blaze 5G ఒక బడ్జెట్ 5G మొబైల్. ఇది Dimensity 6020 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ మొబైల్ 4GB లేదా 6GB RAM వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇందులో 6.5 అంగుళాల HD+ డిస్ప్లేలో 90Hz రిఫ్రెష్ రేట్ ఉంది. 50MP రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ 5000mAh ఉండి, 18W ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ.9,999గా ఉంది. స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవంతో పాటు స్మూత్ యూజర్ ఇంటర్ఫేస్, మంచి గేమింగ్ పెర్ఫార్మెన్స్ కోసం ఇది ఉత్తమ ఎంపిక.

POCO C61:
ఈ ఫోన్ MediaTek G36 ప్రాసెసర్‌తో వస్తుంది. 4GB RAM + 4GB వర్చువల్ RAM కలిపి మొత్తం 8GB వరకూ RAM లా పని చేస్తుంది. 6.71 అంగుళాల HD+ డిస్ప్లేతో పెద్ద స్క్రీన్ అనుభూతి ఇస్తుంది. కెమెరా విభాగంలో 8MP రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాటరీ 5000mAh ఉంటుంది. దీని ధర కేవలం రూ.6,999 మాత్రమే. పెద్ద స్క్రీన్, మంచి బ్యాటరీ బ్యాకప్ ఉండే మొబైల్ కోసం చూస్తున్నవారికి ఇది బాగా పనికి వస్తుంది.

తాజావార్తలు
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!