NTV Telugu Site icon

Credit card utilization : క్రెడిట్ కార్డ్ గట్టిగా వాడేస్తున్నారా.. జాగ్రత్త. ఇక మళ్లీ కష్టమే..!

Credit Card

Credit Card

Credit card utilization : క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? వాడితే నష్టమా.. లాభమా..? క్రెడిట్ కార్డ్ గట్టిగా వాడేస్తున్నారా.. జాగ్రత్త. భవిష్యత్​లో బ్యాంకు నుండి రుణాలు పొందే అవకాశాల ప్రభావం ఉంటుందంటున్నారు నిపుణులు. మనలో చాలా మంది క్రెడిట్ కార్డును స్టేటస్​సింబల్​గా ఉపయోగిస్తూ ఉంటారు. అవసరం ఉన్నా, లేకున్నా పరిమితికి మించి ఖర్చు చేస్తారు. అయితే దీని వల్ల మన క్రెడిట్​స్కోర్ దెబ్బతీస్తుంది. బ్యాంకు ద్వారా మనం లోన్ పొందాలంటే వారు ముందుగా క్రెడిట్ స్కోరును పరిశీలిస్తారు. దాన్ని బట్టే ఆ వ్యక్తికి లోన్ ఇవ్వచ్చా..? లేదా? అనేది నిర్ణయిస్తారు. ఒక క్రెడిట్​ స్కోర్​ తక్కువగా ఉంటే బ్యాంకులు మీకు అప్పు ఇచ్చే అవకాశం బాగా తగ్గిపోతుంది. అదే విధంగా వడ్డీ రేట్లలో రాయితీ పొందాలన్నా కూడా మంచి క్రెడిట్​ స్కోర్​కలిగి ఉండాలి. వాస్తవానికి వీటన్నింటినీ మన క్రెడిట్​కార్డ్​వినియోగం ప్రభావితం చేస్తుందని మనలో చాలా మందికి తెలియదు. అందుకే క్రెడిట్​కార్డ్​ వినియోగంపై ప్రతి ఒక్కరూ సరైన అవగాహన కలిగి ఉండాలి.

Read Also: Bollywood : సోషల్ మీడియా ద్వారా అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న టాప్ బ్యూటిస్ వీరే..

క్రెడిట్​ కార్డు బిల్లులు, బ్యాంకు అప్పులు ఎలా చెల్లిస్తున్నారు అనే దానిపై క్రెడిట్​స్కోర్​ ప్రభావితం అవుతుంది. సరైన సమయంలో బిల్లులు చెల్లిస్తుంటే, క్రెడిట్​స్కోర్​మంచిగా పెరుగుతుంది. కేవలం ఒక్క రోజు ఆలస్యమైనా మన క్రెడిట్​స్కోర్ పడిపోతుంది. అంతేకాకుండా క్రెడిట్​బిల్లులపై ఎక్కవగా వడ్డీ చెల్లించాలి. ఇది అందరూ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది తమ క్రెడిట్​ కార్డును లిమిట్ ఉన్నంత మేరకు ఊడేశ్చాస్తారు. అలా కాకుండా.. కార్డు పరిమితిలో 30 నుంచి 40 శాతానికి మించి ఖర్చు చేయకూడదు. ముఖ్యంగా తక్కువ పరిమితి ఉన్న కార్డుల విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

Read Also: JIO 5G: జియో వినియోగదారులకు శుభవార్త.. తెలంగాణలోని 850 ప్రాంతాల్లో జియో ట్రూ 5జీ సేవలు

అంతేకాకుండా ఎక్కువగా క్రెడిట్ కార్డులు వాడటం వలన వాటిని మెయిన్ టెన్ చేయడం కష్టంగా మారుతుంది. ఒక్క బిల్లు మరిచిపోయినా, క్రెడిట్​స్కోర్​తగ్గిపోతుంది. అంతే కాకుండం ఎక్కువ డబ్బులు వడ్డీల రూపంలో కట్టాల్సి వస్తుంది. ఇకపోతే క్రెడిట్ కార్డు ఉంది కదా అని.. ఏది పడితే అది కొనేయడం చేస్తే.. ఆ తర్వాత బొక్క పడేది మనకే. అందుకే ఎమర్జెన్సీ టైంలో వాడటం మంచిది. మరో విషయం ఏంటంటే కనీస మొత్తాలు వాడుతున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సకాలంలో రుణాలు చెల్లించాలి. లేదంటే వడ్డీ భారం పడుతుంది. దీంతో క్రెడిట్​స్కోర్​తగ్గిపోయి భవిష్యత్​లో బ్యాంకుల నుండి రుణాలు మంజూరు చేసే అవకాశం బాగా తగ్గిపోతుంది. సో జాగ్రత్త.. క్రెడిట్ వాడకం కొద్దిగా తగ్గిస్తే మంచిది.