నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
- నేడు ఆపిల్ ‘Surprise and Shine’ ఈవెంట్..
- ఈవెంట్లో కంపెనీ తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను పరిచయం చేసే అవకాశం..
- iPhone 18 Pro, iPhone 18 Pro Max కూడా ఈ ఈవెంట్లో లాంచ్ అయ్యే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple Surprise and Shine Event: ఆపిల్ (Apple ) సంస్థ నుంచి మరో భారీ ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. నేడు (సెప్టెంబర్ 9) జరగనున్న ‘Surprise and Shine’ ఈవెంట్లో కంపెనీ తొలిసారిగా ఫోల్డబుల్ ఐఫోన్‌ను పరిచయం చేసే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. దీంతో పాటు iPhone 18 Pro, iPhone 18 Pro Max, కొత్త Apple Watch మోడళ్లను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. ఆపిల్ CEOగా జాన్ టెర్న్స్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనకు ఇదే తొలి ఐఫోన్ లాంచ్ ఈవెంట్ కానుంది.
ఫోల్డబుల్ ఐఫోన్ అల్ట్రా:
ఈ ఈవెంట్లో అందరి దృష్టినీ ఆకర్షించే ఉత్పత్తి ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్. కంపెనీలో అంతర్గతంగా దీనిని ‘ఐఫోన్ అల్ట్రా’ గా పిలుస్తున్నట్లు సమాచారం. అయితే తుది మార్కెటింగ్ పేరు ఇంకా ఖరారు కాలేదు. ఫోన్ మడిచినప్పుడు పాస్‌పోర్ట్‌ను పోలిన వెడల్పైన, పొట్టిగా ఉండే డిజైన్‌తో వస్తుందని అంచనాలు ఉన్నాయి. బయట భాగంలో సుమారు 5.5 అంగుళాల డిస్ప్లే, విప్పినప్పుడు 7.8 అంగుళాల ఇంటర్నల్ స్క్రీన్ ఉండవచ్చని తెలుస్తోంది. పెద్ద స్క్రీన్‌పై ఒకేసారి రెండు యాప్స్‌ను పక్కపక్కనే ఉపయోగించుకునే అవకాశం ఉండనుంది.
Also Read
- కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
- Cheapest Phone: కిందపడినా పగలని ఫోన్.. కేవలం రూ.1499లకే..
- Redmi Smart Phone: 1.5K AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీ.. రెడ్ మీ నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్..
- Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
A20 Pro చిప్, C2 మోడెమ్:
ఫోల్డబుల్ ఐఫోన్లో A20 ప్రో చిప్, ఆపిల్ C2 మోడెమ్ ఉండే అవకాశం ఉంది. డార్క్, లైట్ కలర్ ఆప్షన్లలో ఇది రావచ్చని సమాచారం. ఫోల్డబుల్ ఫోన్లలో సాధారణంగా కనిపించే స్క్రీన్ క్రీజ్‌ను తగ్గించేందుకు ప్రత్యేకమైన హింజ్, కస్టమ్ కవర్ గ్లాస్‌ను ఆపిల్ ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని మార్పులు కూడా ఉండనున్నాయి. పేస్ ఐడికి బదులుగా టచ్ ఐడిను ఉపయోగించే అవకాశం ఉంది. వెనుక కెమెరా సెటప్‌లో వైడ్, అల్ట్రా-వైడ్ కెమెరాలు ఉండొచ్చని, టెలిఫోటో కెమెరా మాత్రం ఉండకపోవచ్చని అంచనాలు ఉన్నాయి. ధర విషయంలో ఫోల్డబుల్ ఐఫోన్ $2,199 వరకు ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ప్రారంభంలో $1,999 ధరను లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. సెప్టెంబర్‌లో పరిచయం చేసినప్పటికీ.. ప్రో మోడళ్లతో పాటు వెంటనే విక్రయానికి రాకపోవచ్చు. కొన్ని వారాల తర్వాత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
iPhone 18 Pro, iPhone 18 Pro Max:
ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో డిజైన్ పరంగా పెద్ద మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. సిల్వర్, డార్క్ చెర్రీ, స్కై బ్లూ వంటి కొత్త కలర్ ఆప్షన్లు అందుబాటులోకి రావచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే హార్డ్‌వేర్ పరంగా కీలకమైన అప్గ్రేడ్లు ఉండనున్నాయి. 2nm A20 ప్రో చిప్, C2 మోడెమ్, మెరుగైన వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్, మెరుగైన బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లు రావచ్చని సమాచారం. eSIM-ఓన్లీ ఐఫోన్ 18 ప్రో Maxలో 5,567mAh బ్యాటరీ ఉండొచ్చని రెగ్యులేటరీ ఫైలింగ్స్ సూచిస్తున్నాయి.
కెమెరా విభాగంలో కూడా కీలకమైన మార్పు రావచ్చు. ముఖ్యంగా ప్రో మాక్స్ మోడల్లో మెకానికల్ వేరియబుల్ అపెర్చర్ అందించే అవకాశం ఉంది. దీని ద్వారా కెమెరా సెన్సార్‌లోకి ప్రవేశించే కాంతి పరిమాణాన్ని నియంత్రించడంతో పాటు ఫొటోల్లో Depth of Fieldను కూడా మెరుగ్గా నియంత్రించవచ్చు.
Apple Watch Series 12, Watch Ultra 4:
కొత్త ఆపిల్ వాచ్ మోడళ్లలో పెద్ద డిజైన్ మార్పుల కంటే హెల్త్ ఫీచర్లు, అంతర్గత హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లపై Apple దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. Siri AIకి మెరుగైన సపోర్ట్ అందించే కొత్త భాగాలను ఇందులో ఉపయోగించవచ్చు. ఆపిల్ వాచ్ సిరీస్ 12లో సిరామిక్ కేసు తిరిగి వచ్చే అవకాశం ఉందని, కొత్త కలర్ ఆప్షన్లు కూడా ఉండవచ్చని తెలుస్తోంది. మరోవైపు రీడ్ఇన్స్ యాప్ ను ఆపిల్ పరిచయం చేసే అవకాశం ఉంది. Whoop, Oura వంటి స్మార్ట్ హెల్త్ ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్‌లకు పోటీగా ఈ ఫీచర్ పనిచేయవచ్చని అంచనాలు ఉన్నాయి. వర్కౌట్ సమయంలో మాత్రమే కాకుండా నిరంతరంగా Heart Rate Monitoring చేసే ఫీచర్‌ను కూడా పరీక్షిస్తున్నట్లు సమాచారం. అయితే ఇది ఫైనల్ ప్రొడక్ట్‌లో అందుబాటులో ఉంటుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా లేదు.
AirPods, Smart Home డివైజ్‌లు కూడా?
ఈ ఈవెంట్లో AirPods 5 రిఫ్రెష్ కూడా వచ్చే అవకాశం ఉంది. సాధారణ వెర్షన్‌తో పాటు యాక్టివ్ నాయిస్ క్యాన్సల్ల్యేషన్ సపోర్ట్ ఉన్న మోడల్ కూడా అభివృద్ధిలో ఉన్నట్లు సమాచారం. అయితే కెమెరాలతో వచ్చే కొత్త AirPods మాత్రం 2027 వరకు ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. ఆపిల్ టీవీ, హోమ్ పోడ్ మినీ కొత్త మోడళ్లు కూడా ఈ ఏడాది చివర్లో రావచ్చని అంచనాలు ఉన్నాయి. వీటిలో సిరి AI కోసం వేగవంతమైన ప్రాసెసర్లు ఉండొచ్చు. ఆపిల్ టీవీ రిమోట్లో కూడా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది.
అదే సమయంలో సుమారు 7 అంగుళాల స్మార్ట్ డిస్ప్లేను ఆపిల్ అభివృద్ధి చేసింది. ఇందులో పేస్ రికగ్నిషన్, పర్సనలైజ్డ్ కంటెంట్, పేస్ టైం, స్మార్ట్ హోమ్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు ఉండవచ్చని తెలుస్తోంది. అయితే ఈ డివైజ్‌ను సెప్టెంబర్ 9 ఈవెంట్లోనే ప్రకటిస్తారా అనేది స్పష్టంగా లేదు.
Apple ‘Surprise and Shine’ ఈవెంట్ సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటలకు పసిఫిక్ టైంకు ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం ఇది సెప్టెంబర్ 9 రాత్రి 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఆపిల్ వెబ్సైట్, ఆపిల్ టీవీ యాప్ ద్వారా ఈ ఈవెంట్‌ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
Assam Murder Case: ఫ్రిజ్‌లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌కు షాక్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరం.. అసలు కారణం ఇదే!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
ట్రెండింగ్
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!