NTV Telugu Site icon

IOS 16: ఐఓఎస్‌ 16ను ఆవిష్కరించిన యాపిల్‌.. అదిరిపోయేలా కొత్త ఫీచర్లు

Ios16

Ios16

టెక్‌ దిగ్గజం యాపిల్‌ తమ ఐఫోన్‌లకు సంబంధించి ప్రస్తుత సాఫ్ట్‌వేర్‌కు స్వల్ప మార్పులు చేసి కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఐవోఎస్‌ 16ను ఆవిష్కరించింది. కొత్తకొత్త ఫీచర్లు, అదిరిపోయే లుక్‌తో దీన్ని తీర్చిదిద్దింది. వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2022 సందర్భంగా ఐఓఎస్ 16 (iOS 16)ను ప్రవేశపెట్టింది యాపిల్. ఐఫోన్ 8 సిరీస్ ఆ తర్వాతి మోడల్స్ అన్నింటికీ కొన్ని నెలల్లో ఐఓఎస్ 16 అప్‌డేట్‌ వస్తుంది. సెప్టెంబర్‌లో ఈ కొత్త వెర్షన్‌ అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా లాక్‌స్క్రీన్‌కు చాలా కొత్త ఫీచర్లను ఐఓఎస్‌ 16లో యాపిల్ తీసుకొచ్చింది. సిస్టమ్‌ యాప్స్‌ను మెరుగ్గా చేయడంతో పాటు రీడిజైన్‌ చేసింది. మెసేజింగ్, మ్యాప్స్, మెయిల్ ఇలా చాలా యాప్స్‌కు కొత్త ఫీచర్లను యాడ్ చేసింది.

RBI: డిజిటల్ లావాదేవీలకు మరింత బూస్ట్.. యూపీఐలతో క్రెడిట్ కార్డులు లింక్‌

త్వరలో దీన్ని ఉచిత డౌన్‌లోడ్‌గా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనుంది. గతంతో పోలిస్తే ఐఫోన్‌ యూజర్లు తరచూ ఫోన్‌ను మార్చేయకుండా పాత డివైజ్‌నే మరికొంత ఎక్కువ కాలం ఉపయోగిస్తున్న నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లు ఇవ్వాల్సిన అవసరం పెరిగింది. కొత్త ఐఓఎస్‌తో యూజర్లు తమ ఫేవరెట్‌ యాప్‌లను లాక్‌ స్క్రీన్‌పై విడ్జెట్లుగా పెట్టుకోవచ్చు. అలాగే లాక్‌ స్క్రీన్‌పై లైవ్‌ నోటిఫికేషన్లు పొందవచ్చు. ప్రస్తుతం ఫోన్‌ స్క్రీన్‌ పైభాగం నుంచి వచ్చే ఇతరత్రా నోటిఫికేషన్లు ఇకనుంచి కింది భాగం నుంచి వస్తాయి.

అలాగే మెసేజీలను పంపిన తర్వాత కూడా ఎడిట్‌ చేయడం లేదా పూర్తిగా రద్దు చేయడం వంటి ఫీచర్లు ఐఫోన్‌ మెసేజింగ్‌ సిస్టమ్‌లో ఉంటాయి. అయితే, ఇందుకోసం ఇరువైపుల యూజర్లు, యాపిల్‌ మెసేజింగ్‌ యాప్‌ను ఉపయోగిస్తుండాలి.