Site icon NTV Telugu

Whatsapp Ap: వాట్సాప్ తో ఏపీ డీల్..ఫేక్ ప్రచారానికి అడ్డుకట్ట

Jagan Whatsapp

Jagan Whatsapp

వాట్సాప్ ఇప్పుడు అందరికీ చేరువ అయింది. వాట్సాప్ ద్వారా సమాచారం వేగంగా అవతలి వ్యక్తులకు చేరుతోంది. ప్రభుత్వ అధికారులు కూడా వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రజలకు చేరువ అవుతున్న సందర్భం ఇది. ఏపీ ప్రభుత్వం సోష‌ల్ మీడియా దిగ్గజం వాట్సాప్‌తో ఓ కీల‌క ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంపై ఏపీ డిజిట‌ల్ కార్పొరేష‌న్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చిన్న వాసుదేవ రెడ్డి సంతకం చేశారు.

ఈ ఒప్పందం ప్రకారం ఏపీ ప్రభుత్వంతో క‌లిసి వాట్సాప్ ప‌నిచేయ‌నుందని ఆయ‌న తెలిపారు. ఏపీ ప్రభుత్వం త‌ర‌ఫున ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాల‌ను ప్రజ‌ల‌కు చేర‌వేయ‌డమే ల‌క్ష్యంగా ప్రభుత్వంతో క‌లిసి వాట్సాప్ ప‌నిచేయ‌నుంద‌ని వాసుదేవ రెడ్డి పేర్కొన్నారు.

అంతేకాకుండా ప్రభుత్వ కార్యక్రమాల‌పై జ‌రుగుతున్న దుష్ప్రచారాన్ని కూడా స‌మ‌ర్థవంతంగా అడ్డుకునేందుకు ఈ ఒప్పందం ఉప‌యోగ‌ప‌డ‌నుంది. ఈ ఒప్పందానికి సంబంధించిన విష‌యాలతో పాటు ఈ ఒప్పందం ద్వారా ఎలాంటి ప్రయోజ‌నం ద‌క్కనుంద‌న్న విష‌యంపై వాసుదేవ‌రెడ్డి తెలుగుతో పాటు ఆంగ్లంలోనూ ఓ ప్రక‌ట‌న విడుద‌ల చేశారు. ఏపీ ప్రభుత్వం అన్ని వర్గాలకు చేరువ అవుతున్న సంగతి తెలిసిందే. నవరత్నాల వంటి సంక్షేమ కార్యక్రమాలు, వాటి ద్వారా లబ్ది పొందుతున్న వివిధ వర్గాల గురించి ఇతరులకు తెలిపేందుకు ఈ ఒప్పందం దోహదం చేయనుంది. ఫేక్ ప్రచారం ద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు తేవడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి ఆగడాలకు కళ్ళెం వేసేందుకు ఈ ప్రయత్నం దోహదపడనుంది.

Rajyasabha Polls: ఉత్కంఠగా రాజ్యసభ ఎన్నికలు..

Exit mobile version