వాట్సాప్ ఇప్పుడు అందరికీ చేరువ అయింది. వాట్సాప్ ద్వారా సమాచారం వేగంగా అవతలి వ్యక్తులకు చేరుతోంది. ప్రభుత్వ అధికారులు కూడా వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రజలకు చేరువ అవుతున్న సందర్భం ఇది. ఏపీ ప్రభుత్వం సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్‌తో ఓ కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంపై ఏపీ డిజిటల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చిన్న వాసుదేవ రెడ్డి సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఏపీ ప్రభుత్వంతో కలిసి వాట్సాప్…
ఏపీ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కీలకపాత్ర పోషిస్తున్న ఏపీ డిజిటల్ కార్పొరేషన్ (ఏపీడీసీ) ఇప్పుడు వాట్సాప్ సేవలను కూడా ప్రారంభించింది. ఇందుకోసం ఏపీడీసీ వాట్సాప్‌తో ఒప్పందం చేసుకుంది. ఏపీలో ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి వేదిక అవసరాన్ని, ప్రాముఖ్యతను గుర్తించి వాట్సాప్ ఇండియా ఏపీడీసీ వాట్సాప్ వేదికకు పూర్తి సాంకేతిక మద్దతు అందిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు, నిర్ణయాలకు సంబంధించిన…