Amazon Offers: అమెజాన్‌లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G ఫోన్ ఈ సేల్‌లో అత్యంత భారీ తగ్గింపుతో లభించనుంది. భారతదేశంలో లాంచ్ అయినప్పుడు దీని బేస్ వేరియంట్ ధర రూ.1,29,999 గా ఉండేది, కానీ అమెజాన్ సేల్‌లో ఇది రూ.90,000 లోపు అంటే లభిస్తుందని టీజ్ చేశారు. అంటే దీనిపై దాదాపు రూ.40,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఫీచర్ల పరంగా చూస్తే, ఇందులో గెలాక్సీ AI ఫీచర్లు, కస్టమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్ ఉన్నాయి. గొరిల్లా ఆర్మర్ ప్రొటెక్షన్ కలిగిన 6.9 ఇంచుల డైనమిక్ అమోలెడ్ 2X స్క్రీన్, 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో కూడిన నాలుగు వెనుక కెమెరాలు, 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. అలాగే.. IP68 రేటింగ్, 5000mAh బ్యాటరీ, 45W వైర్డ్ మరియు 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ దీని సొంతం.
వన్‌ప్లస్ 13 5G ఫోన్‌పై కూడా అద్భుతమైన డిస్కౌంట్ ఉంది. రూ.69,999 లాంచ్ ధర కలిగిన ఈ ఫోన్, సేల్‌లో రూ.50,000 లోపు అందుబాటులోకి రానుంది. దీనిపై దాదాపు రూ.20,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్లో 6.82 ఇంచుల క్వాడ్ HD+ LTPO 4.1 ProXDR డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉన్నాయి. హాసెల్‌బ్లాడ్ ట్యూన్ చేసిన 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇందులో ఉన్నాయి. కేవలం 36 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయ్యే 100W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ మరియు 6000mAh పెద్ద బ్యాటరీ దీని ప్రత్యేకత. ఇది IP68+69 రేటింగ్‌తో వస్తుంది.
Also Read
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
- iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్‌హౌస్!
- Google Earthquake Alert: భూకంపానికి ముందే గూగుల్ అలర్ట్.. కాంతి వేగంతో మొబైల్ స్క్రీన్లపైకి వార్నింగ్.. కానీ..
- Meta AI-Powered Smart Glasses: 3K వీడియో రికార్డింగ్, లైవ్ ట్రాన్స్లేషన్.. ఏఐ పవర్డ్ మెటా గ్లాసెస్ విడుదల
రెడ్మి టర్బో 5 5G ఫోన్ బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ.35,999 ధరకే లభిస్తుంది. దీని అసలు ప్రారంభ ధర రూ.37,999 కాగా, టాప్ వేరియంట్ ధర రూ.40,999 గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్సెట్తో వచ్చే ఈ ఫోన్ అత్యంత వేగవంతమైన రెడ్మి ఫోన్. ఇందులో 6.59 ఇంచుల 1.5K అమోలెడ్ డిస్ప్లే, OIS సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ Sony IMX882 మెయిన్ కెమెరా, 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. వీటన్నిటితో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 7540mAh మెగా బ్యాటరీ మరియు IP66 నుండి IP69K వరకు అత్యుత్తమ ప్రొటెక్షన్ రేటింగ్స్ ఉన్నాయి.
తాజావార్తలు
-
Amazon Offers: అమెజాన్‌లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్‌లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!