Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
- సీనియర్ సిటిజన్లు, సెకండరీ SIM లేదా Wi-Fi వినియోగదారులకు రూ.1,849 ప్లాన్
- రూ.2,249 ప్లాన్‌లో రోజుకు 1GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు
- రూ.2,999 ప్లాన్‌లో రోజుకు 2GB డేటాతో పాటు Airtel Thanks ప్రయోజనాలు
- రూ.3,999 ప్రీమియం ప్లాన్‌లో రోజుకు 2.5GB హై-స్పీడ్ డేటా, అపరిమిత కాల్స్, అదనపు డిజిటల్ బెనిఫిట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Airtel Recharges: భారతదేశంలోని రెండో అతిపెద్ద టెలికాం సంస్థ భారతి ఎయిర్టెల్ (Airtel) తన వినియోగదారుల కోసం పలు వార్షిక (365 రోజుల) ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ప్రతి నెలా లేదా మూడు నెలలకోసారి రీఛార్జ్ చేసుకునే ఇబ్బంది లేకుండా.. ఒకేసారి ఏడాది పాటు చెల్లుబాటు అయ్యే ఈ ప్లాన్లు వినియోగదారులకు సౌకర్యాన్ని కల్పిస్తాయి. కాల్స్ మాత్రమే అవసరమైన వారి నుంచి భారీ డేటా వినియోగించే వారివరకు అందరికీ తగిన ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.
రూ.1,849 ప్లాన్:
ఈ ప్లాన్ ప్రధానంగా మొబైల్ డేటా అవసరం లేని వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ఈ ప్లాన్ ప్రయోజనాల విషయానికి వస్తే..
Also Read
- 120dB స్పీకర్, IP64 రేటింగ్‌తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
- Huawei MatePad 11.5 2026: హువావే మేట్‌ప్యాడ్ 11.5 భారత్‌లో లాంచ్.. 10,100mAh బ్యాటరీ, 120Hz పేపర్‌మ్యాట్ డిస్ప్లే
- Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
- 144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
* 365 రోజుల వ్యాలిడిటీ
* అపరిమిత లోకల్, STD, రోమింగ్ కాల్స్
* ఏడాది మొత్తం 3,600 SMSలు
* మొబైల్ డేటా లేదు
ఈ ప్లాన్ సీనియర్ సిటిజన్లు, సెకండరీ SIM వాడేవారు లేదా Wi-Fiపైనే ఆధారపడే వారికి అనుకూలంగా ఉంటుంది.
రూ.2,249 ప్లాన్:
కాల్స్‌తో పాటు రోజువారీ డేటా కూడా కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. ఈ ప్లాన్ ప్రయోజనాల విషయానికి వస్తే..
* 365 రోజుల వ్యాలిడిటీ
* అపరిమిత కాల్స్
* రోజుకు 1GB హై-స్పీడ్ డేటా
* రోజుకు 100 SMSలు
* Airtel Rewards, కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రయోజనాలు
రూ.2,999 ప్లాన్:
స్ట్రీమింగ్, వీడియో కాల్స్, ఆన్లైన్ క్లాసులు వంటి అవసరాల కోసం ఎక్కువ డేటా వినియోగించే వారికి ఈ ప్లాన్ సరిపోతుంది. ఈ ప్లాన్ లో ప్రయోజనాల విషయానికి వస్తే..
* 365 రోజుల వ్యాలిడిటీ
* అపరిమిత కాల్స్
* రోజుకు 2GB డేటా
* రోజుకు 100 SMSలు
* Airtel Thanks రివార్డ్స్, డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ప్రయోజనాలు అందుతాయి.
రూ.3,999 ప్లాన్:
ఎక్కువ డేటా వినియోగించే వినియోగదారుల కోసం ఎయిర్ టెల్ అందిస్తున్న ప్రీమియం వార్షిక ప్లాన్ ఇదే. ఈ ప్లాన్ ప్రయోజనాల విషయానికి వస్తే..
* 365 రోజుల వ్యాలిడిటీ
* అపరిమిత కాల్స్
* రోజుకు 2.5GB హై-స్పీడ్ డేటా
* రోజుకు 100 SMSలు
* అదనపు Airtel Thanks రివార్డ్స్, డిజిటల్ బెనిఫిట్స్
మీకు ఏ ప్లాన్ బెస్ట్?
–> కాల్స్ మాత్రమే అవసరమైతే: రూ.1,849 ప్లాన్.
–> తక్కువ డేటా వినియోగిస్తే: రూ.2,249 ప్లాన్.
–> రోజూ స్ట్రీమింగ్, వీడియో కాల్స్ చేస్తే: రూ.2,999 ప్లాన్.
–> హెవీ డేటా యూజర్లైతే: రూ.3,999 ప్లాన్.
ఒకేసారి ఏడాది పాటు రీఛార్జ్ చేసుకోవాలనుకునే వారికి Airtel వార్షిక ప్లాన్లు మంచి ఎంపిక. నెలనెలా రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా, ఏడాది మొత్తం కాల్స్, డేటా, SMS ప్రయోజనాలను అందిస్తాయి.
తాజావార్తలు
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
Bhatti Vikramarka: తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం.. మా టార్గెట్ ఇదే
-
PM Modi: డ్రగ్స్‌కు దూరంగా యువత.. వికసిత్ భారత్‌కు అదే కీలకం.. ‘నశా ముక్త్ యువ’ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
-
India vs Sri Lanka: గంభీర్‌కు అగ్ని పరీక్ష.. కెప్టెన్ గిల్‌కు బిగ్ సవాల్.. 7 టెస్టులు గెలవాల్సిందే!
-
US Visa Rules 2026: అమెరికా వీసాకు ఇక రూ.17 లక్షల బాండ్.. భారతీయులకు భారీ ఊరట.. పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
120dB స్పీకర్, IP64 రేటింగ్‌తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్‌లో నిజం ఎంత.!