NTV Telugu Site icon

Airtel Recharge Plans: మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్.. రీఛార్జ్ ప్లాన్ల ధరలను తగ్గించిన ఎయిర్‌టెల్

Airtel

Airtel

రీఛార్జ్ ధరలు మొబైల్ యూజర్లను బెంబేలెత్తిస్తున్నాయి. అధిక ధరలతో సతమతమైపోతున్నారు. రీఛార్జ్ చేసుకోకపోతే సేవలను పొందలేని పరిస్థితి. ఈ క్రమంలో యూజర్లకు ఊరట కలిగేలా ఎయిర్ టెల్ తీపి కబురును అందించింది. ఇటీవల వాయిస్, ఎస్ఎంఎస్ కోసం స్పెషల్ గా తీసుకొచ్చిన రీఛార్జ్ ప్లాన్ల ధరలను తగ్గించింది. బెనిఫిట్స్ ను మార్చకుండా ధరలను తగ్గిస్తూ కొత్త ప్లాన్లను ప్రకటించింది. ఇప్పటికే కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీని పొందొచ్చు.

ఎయిర్ టెల్ కాల్స్, ఎస్ఎంఎస్ ల కోసం తీసుకొచ్చిన ప్లాన్లలో రూ. 499 ఒకటి. తాజాగా ఈ ప్లాన్ ను రూ. 30 తగ్గిస్తూ రూ. 469గా మార్చింది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. అన్‌లిమిటెడ్ లోకల్ ఎస్టీడీ అండ్ రోమింగ్స్ కాల్స్ పొందొచ్చు. 900 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ఈ ప్లాన్ తో 3 నెలల పాటు అపోలో 24/7 సర్కిల్ మెంబర్‌షిప్ సహా హలో ట్యూన్స్ బెనిఫిట్స్ ను కూడా పొందొచ్చు.

ఎయిర్ టెల్ తీసుకొచ్చిన మరో ప్లాన్ రూ. 1959. తాజాగా ఈ ప్లాన్ పై రూ. 110 తగ్గించి రూ. 1849తో కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఈ రీఛార్జ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 3600 ఎస్ఎంఎస్‌లు లబిస్తాయి. ఈ ప్లాన్ తో అపోలో సర్కిల్, హలో ట్యూన్స్ బెనిఫిట్స్ పొందొచ్చు. ఇటీవల వాయిస్, ఎస్ఎంఎస్ ల కోసం ప్రత్యేకంగా రీఛార్జ్ ప్లాన్లను తీసుకురావాలని.. టెలికాం కంపెనీలను ట్రాయ్ ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో.. ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా డేటా లేకుండా కొత్త ప్లాన్స్ ను ప్రకటిస్తున్నాయి.