NTV Telugu Site icon

Airtel Recharge Plans: 60 రోజుల వ్యాలిడిటీతో వస్తున్న ఏకైక ప్లాన్ ఇదే.. తక్కువ ధరకే సూపర్ బెనిఫిట్స్

Airtel

Airtel

రీఛార్జ్ ప్లాన్ల ధరలు ఎక్కువగా ఉండడంతో మొబైల్ యూజర్లు నెట్ వర్క్ మారేందుకు రెడీ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీలు తక్కువ ధరలోనే సూపర్ బెనిఫిట్స్ తో రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తు్న్నాయి. మీరు ఎయిర్ టెల్ యూజర్స్ అయితే మీకు క్రేజీ ప్లాన్ అందుబాటులో ఉంది. కంపెనీ తన పోర్ట్‌ఫోలియోలో 60 రోజుల సర్వీస్ చెల్లుబాటుతో వచ్చే ఒకే ఒక ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఆ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 619. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్ మరెన్నో బెనిఫిట్స్ అందుకోవచ్చు.

Also Read:NIT-Calicut Professor: గాడ్సేని ప్రశంసించిన ఎన్ఐటీ ప్రొఫెసర్ డీన్‌గా నియామకం.. వివాదం..

భారతి ఎయిర్‌టెల్ రూ. 619 ప్రీపెయిడ్ ప్లాన్

భారతీ ఎయిర్‌టెల్ రూ.619 ప్రీపెయిడ్ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 1.5 జీబీ రోజువారీ డేటా లభిస్తాయి. ఈ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే వస్తుంది. ఇది ఎయిర్‌టెల్ లోని OTT ప్లాట్‌ఫామ్. ఇది SonyLIV, ఇతర OTT ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కంటెంట్‌ను ఇస్తుంది.. Xstream Play యాక్సెస్ ఉన్న వినియోగదారులు ఒకే లాగిన్‌తో తమకు ఇష్టమైన అన్ని టీవీ షోలు, సినిమాలు, లైవ్ ఛానల్స్ చూడవచ్చు.

Also Read:BJP: ‘‘హిందీ వద్దు, ఉర్దూ ముద్దా..?’’ స్టాలిన్‌పై బీజేపీ ఫైర్..

ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలలో అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలోట్యూన్స్ ఉన్నాయి. ఇది 1.5GB రోజువారీ డేటాను అందించే ప్లాన్ కాబట్టి 4G డేటాతో మాత్రమే వస్తుంది. ఎయిర్‌టెల్ లో అన్ లిమిటెడ్ 5G డేటా తో కూడిన రీచార్జ్ ప్లాన్ కావాలనుకుంటే రూ. 649 ప్లాన్‌ను ట్రై చేయొచ్చు. రూ. 619 ప్లాన్ కంటే దీని ధర కేవలం రూ.30 మాత్రమే ఎక్కువ. కానీ ఇది అపరిమిత 5G డేటా, 56 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. కస్టమర్లు ఈ ప్లాన్‌లను కంపెనీ సైట్‌లో చూడవచ్చు.