New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
- డేటా అవసరం లేని వినియోగదారుల కోసం ఎయిర్టెల్ కొత్త ప్లాన్లు
- రూ.185, రూ.203, రూ.206 ధరల్లో మూడు ప్రీపెయిడ్ ప్లాన్లు
- మూడు ప్లాన్లలో మొబైల్ డేటా ప్రయోజనం ఉండదు
- అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్
- ప్రతి ప్లాన్‌లో మొత్తం 300 ఎస్ఎంఎస్లు
- హెలోట్యూన్స్ సదుపాయం ఉచితం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Airtel New Recharge Plans: భారత టెలికాం రంగంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ఎయిర్టెల్ (Airtel) కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ అవసరాలున్న వినియోగదారుల కోసం 3 కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. మొబైల్ డేటా లేకుండా ప్రత్యేకంగా వాయిస్, ఎస్ఎంఎస్ సేవలను అందిస్తున్న తొలి టెలికాం సంస్థగా ఎయిర్టెల్ నిలవనుంది.
ఈ కొత్త ప్లాన్లలో అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్‌తో పాటు మొత్తం 300 ఎస్ఎంఎస్లు, హెలోట్యూన్స్ ఉచితంగా లభిస్తాయి. అయితే ఈ మూడు ప్లాన్లలో మొబైల్ డేటా మాత్రం ఉండదు. ఇందులో రూ.185 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ లో అపరిమిత వాయిస్ కాలింగ్, 300 ఎస్ఎంఎస్లు అందుబాటులో ఉంటాయి. ఇక రూ.203 ప్లాన్‌లోనూ ఇదే ప్రయోజనాలు లభిస్తాయి. అయితే దీని వ్యాలిడిటీ 30 రోజులు.
Also Read
- Chinmay Sutar: 77 ఏళ్ల తర్వాత రంజీలో క్వాడ్రుపుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన చిన్మయ్.!
- WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
- 108MP+50MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రాబోతున్న HMD Vibe 2 Max..!
- Amazon Layoffs: అమెజాన్‌లో మళ్లీ లే ఆఫ్స్.. డెలివరీ విభాగంలో భారీగా కోతలు..
వీటితోపాటు మరో రూ.206 ప్లాన్ క్యాలెండర్-మంత్ వ్యాలిడిటీని అందిస్తుంది. అంటే రీఛార్జ్ చేసిన తేదీకి అనుగుణంగా తర్వాతి నెలలో అదే తేదీ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ మూడు ప్లాన్లలోనూ కాల్స్, ఎస్ఎంఎస్లకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మార్గదర్శకాల నేపథ్యంలో ఎయిర్టెల్ ఈ ప్లాన్లను తీసుకొచ్చింది. అక్టోబర్ 21లోపు టెలికాం కంపెనీలు డేటా అవసరం లేని వినియోగదారుల కోసం ప్రత్యేక వాయిస్, ఎస్ఎంఎస్ టారిఫ్ వోచర్లను అందుబాటులోకి తీసుకురావాలని ట్రాయ్ సూచించింది.
ఈ ప్లాన్లు ప్రధానంగా ఫీచర్ ఫోన్ వినియోగదారులు, సెకండరీ సిమ్ ఉపయోగించే వారు, ఇంటర్నెట్ కోసం ఎక్కువగా వై-ఫైపై ఆధారపడే వారికి ఉపయోగపడనున్నాయి. ఇప్పటివరకు వీరు డేటా ఉపయోగించకపోయినా కాల్స్, ఎస్ఎంఎస్లతో పాటు డేటా కలిగిన ప్యాక్‌లకు చెల్లించాల్సి వచ్చేది. ఎయిర్టెల్ తర్వాత రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ కూడా ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా ఇలాంటి ప్రత్యేక వాయిస్, ఎస్ఎంఎస్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
YSRCP : స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ..
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!
-
Honey Trap: హైదరాబాద్‌లో హనీ ట్రాప్ కలకలం.. నకిలీ ఖాతాలతో వేల మందికి టోకరా
ట్రెండింగ్
-
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
-
WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
-
Vaibhav Sooryavanshi: ఆ ముగ్గురిలో ఒకరు తప్పుకుంటూనే వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.!
-
108MP+50MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రాబోతున్న HMD Vibe 2 Max..!
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!