Airplane Mode: మొబైల్‌లో ‘ఎయిర్‌ప్లేన్ మోడ్’ ఆన్ చేస్తే ఏమవుతుందో తెలుసా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Airplane Mode: ప్రస్తుతం మనలో దాదాపు స్మార్ట్ ఫోన్ ను వినియోగిస్తునే ఉన్నాము. అయినా కానీ చాలా మందికి మొబైల్ లో అందించే చాలా ఫీచర్లను ఎందుకు వినియోగించుకోవాలన్న విషయాలు తెలియదు. ముఖ్యంగా ఎయిర్‌ప్లేన్ మోడ్, లింక్ టు విండోస్, బ్యాటరీ సేవర్, స్ప్లిట్ స్క్రీన్, స్మార్ట్ మిర్రరింగ్, స్క్రీన్ క్యాస్ట్ ఇలా ఎన్నో ఫీచర్లను ఉన్న వినియోగించలేకపోతున్నాము. ఇకపోతే స్మార్ట్‌ఫోన్లలో ఉండే ఎయిర్‌ప్లేన్ మోడ్ (Airplane Mode) ఎందుకు వినియోగిస్తారు? అసలు దీన్ని యాక్టివేట్ చేసినప్పుడు ఏమి జరుగుతోందో వివరంగా చూద్దాం..
ఎయిర్‌ప్లేన్ మోడ్ ఉద్దేశ్యం:
ఎయిర్‌ప్లేన్ మోడ్ (Airplane Mode) అనేది ఒక ప్రత్యేక ఫీచర్. దీనిని ఆన్ చేస్తే.. ఫోన్‌లోని అన్ని వైర్‌లెస్ కమ్యూనికేషన్ ఫీచర్లు అంటే సెల్యులార్ నెట్‌వర్క్, Wi-Fi, బ్లూటూత్, GPS సిగ్నల్స్ వంటివి తాత్కాలికంగా నిలిచిపోతాయి. ఇది ప్రధానంగా విమాన ప్రయాణ సమయంలో, విమాన నావిగేషన్ వ్యవస్థలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు వాడుతారు. విమాన ప్రయాణంలో ఫోన్ సిగ్నల్స్ వల్ల విమాన నావిగేషన్ లేదా కమ్యూనికేషన్ సిస్టమ్‌కి ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా నిరోధించడం ఎయిర్‌ప్లేన్ మోడ్ ముఖ్య ఉద్దేశ్యం. దీని వాడడం ద్వారా అన్ని వైర్‌లెస్ సిగ్నల్స్‌ను ఒకేసారి ఆఫ్ చేసి, మొబైల్ ను “ఆఫ్‌లైన్” మోడ్‌లోకి మార్చడం. అంతేకాదు.. కొన్ని సందర్భాల్లో బ్యాటరీని ఆదా చేయడం, లేదా సిగ్నల్స్ అవసరం లేని పరిస్థితుల్లో ఉపయోగించడం కోసం దీనిని వాడుతారు.
Also Read
- 200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
- New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
- 7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- Dell XPS 13: Dell XPS 13 వచ్చేసింది.. 2.5K టచ్‌స్క్రీన్, Intel Core Ultra 7 ప్రాసెసర్ తో ప్రీమియం ల్యాప్‌టాప్
Supreme Court: “ఒక్కటి కూడా ఉండొద్దు”.. వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..

ప్రయోజనాలు:
ఈ ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆన్ చేయడం ద్వారా.. సిగ్నల్ సెర్చ్ ఆపివేయడం వల్ల మొబైల్ లోని బ్యాటరీ ఎక్కువ సేపు వినియోగంలో ఉంటుంది. అలాగే కాల్స్, మెసేజ్‌లు, నోటిఫికేషన్‌లు రాకుండా ప్రశాంతంగా పనిచేయడంలో ఫోకస్ పెరుగుతుంది. ఇంకో విషయమేమిటంటే ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో చార్జ్ చేయడం ద్వారా మొబైల్ మాములు కంటే కొంచెం వేగంగా ఛార్జ్ అవుతుంది. మొబైల్ సిగ్నల్స్ ఆఫ్ కావడం వల్ల తాత్కాలికంగా మన చుట్టూ రేడియేషన్ స్థాయి తగ్గుతుంది కూడా. అలాగే ఇదివరకు చెప్పినట్లుగా విమాన ప్రయాణంలో ఎటువంటి సాంకేతిక అంతరాయం లేకుండా సురక్షిత ప్రయాణం చేయవచ్చు.
ప్రతికూలతలు:
ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆన్ చేయడం వల్ల ప్రయోజనాలే కాదు.. ప్రతికూలతలు కూడా ఉన్నాయండోయ్.. ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆన్ చేయడం ద్వారా మనం కాల్స్, SMSలు, మొబైల్ డేటా ఉపయోగించలేరు. అంతేకాకుండా నెట్వర్క్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల అత్యవసర సమయంలో వెంటనే ఇతరులతో సంప్రదించలేరు. ప్రతిరోజు అలవాటు పడ్డ వాట్సాప్, ఇమెయిల్, సోషల్ మీడియా నోటిఫికేషన్లు ఆగిపోతాయి. అలాగే కొన్ని యాప్స్‌లో లైవ్ లొకేషన్ సరిగ్గా పని చేయకపోవచ్చు.

మొత్తం మీద, ఎయిర్‌ప్లేన్ మోడ్ అనేది అవసరమైనప్పుడు ఉపయోగపడే ఫీచర్. విమాన ప్రయాణం, బ్యాటరీ సేవింగ్, లేదా నిర్దిష్ట సమయంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలనుకుంటే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ యాక్టివేట్ చేసినప్పుడు నెట్‌వర్క్ ఆధారిత సేవలు నిలిచిపోతాయని గుర్తుంచుకోవాలి.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!