AI Impact: షాకింగ్ రిపోర్ట్.. ఆ దెబ్బతో 2030 నాటికి లక్షల ఉద్యోగాలు గల్లంతు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AI Impact: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోజురోజుకీ ఎంత అబివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాలిసిన పనిలేదు. ఇకపోతే, అనేక రంగాలలో పని శైలిలో ఎంత విప్లవాత్మక మార్పులకు దారితీస్తోందో ప్రతిరోజు చాలానే చూస్తున్నాము. అయితే, ఈ సాంకేతిక విప్లవం భారత్‌లో లక్షల మంది ఉద్యోగాలకు ముప్పుగా మారబోతున్నట్టు తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా తయారీ, రిటైల్, విద్య రంగాల్లో భారీగా ఉద్యోగ నష్టాలు చోటుచేసుకోనున్నాయని ‘సర్వీస్‌నౌ’ అనే సంస్థ తాజా నివేదికలో పేర్కొంది.
ఈ నివేదిక ప్రకారం, 2030 నాటికి దాదాపు లక్ష ఎనభై కోట్ల ఉద్యోగాలు AI వల్ల నష్టపోయే అవకాశం ఉందని అంచనా. ముఖ్యంగా తయారీ రంగంలో సుమారుగా 80 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలోకి వెళ్లే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అలాగే రిటైల్ రంగంలో 76 లక్షల ఉద్యోగాలు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తేలింది. ఇక విద్యా రంగంలో కూడా ఏకంగా 25 లక్షల వరకు ఉద్యోగాలు AI ప్రభావంతో తగ్గిపోయే అవకాశముందని నివేదిక హెచ్చరించింది.
Also Read
- iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
- Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
- రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
Ather 450S: ఏథర్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్ తో 161KM రేంజ్
మరోవైపు వినియోగదారులకు ప్రత్యక్ష సేవలందించే నిర్వాహకులు, పేరోల్ క్లర్క్స్ వంటి ఉద్యోగాలపై AI ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఎందుకంటే ఇవి ఆటోమేషన్‌కు అత్యధికంగా లోనయ్యే క్యాటగిరీలో ముందు వరుసలో ఉన్నాయి. అలాగే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సిస్టమ్ అడ్మిన్‌లు, కన్సల్టెంట్లు వంటి హై-స్కిల్ ఉద్యోగాలు AI సహకారంతో కొత్తదారులను సృష్టించనున్నాయి. ఇక ఈ వివరాలను సర్వీస్‌నౌ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సుమీత్ మాథుర్ వెల్లడించిన ప్రకారం.. AI వృద్ధితో 1.35 కోట్ల ఉద్యోగాల పాత్రలు పూర్తిగా మారిపోతాయి. అలాగే, 30 లక్షల కొత్త టెక్ ఉద్యోగాలు ఏర్పడతాయన్న ఆశాభావం కూడా ఉందని ఆయన అన్నారు.
Shilpa Ravi: జగన్‌ను జైలుకు పంపేందుకు కుట్ర.. కూటమి ప్రభుత్వంపై శిల్పా రవి ఆగ్రహం
ఇది ఇలా ఉండగా, AI పట్ల స్వీకరణను లెక్కించేందుకు నిర్వహించిన సర్వేలో 500 మందికిపైగా ఇండస్ట్రీ లీడర్లు పాల్గొన్నారు. ఈ సర్వేలో సగటున సంస్థలు తమ టెక్ బడ్జెట్‌లో 13.5 శాతం ఖర్చులను AI కోసం కేటాయిస్తున్నట్లు వెల్లడైంది. అలాగే నాలుగో వంతు సంస్థలు ఇప్పటికే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ దశలో ఉన్నాయి. అయితే, ఈ మార్పులకు అడ్డుగోడగా డేటా భద్రత కనిపిస్తోందని నివేదిక స్పష్టం చేసింది. ఇంకా సుమారు 30% సంస్థలు డేటా సెక్యూరిటీపై ఆందోళన వ్యక్తం చేశాయి. అలాగే 26% కంపెనీలు భవిష్యత్తులో అవసరమయ్యే నైపుణ్యాలపై స్పష్టత లేదని అభిప్రాయపడినట్లు తెలిపింది.
తాజావార్తలు
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
-
UK SPLIT : బ్రిటీష్ సామ్రాజ్యం ముక్కలవబోతోందా?
-
PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!