NTV Telugu Site icon

iPhone 15: ఐఫోన్ 15 కొనడానికి ఏకంగా 17 గంటల పాటు క్యూలో నిల్చున్నాడు..

Iphone 15

Iphone 15

iPhone 15: దేశంలో ఐఫోన్ 15 క్రేజ్ మామూలుగా లేదు. ముంబై, ఢిల్లీలోని ఆపిల్ స్టోర్ల ముందు జనాలు బారులు తీరారు. ఇటీవల ఆపిల్ సంస్థ ఐఫోన్ 15ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు నుంచి ఆపిల్ స్టోర్లలో అమ్మకాలు మొదలయ్యాయి. ఫోన్‌ని సొంతం చేసుకోవడానికి ఐఫోన్ లవర్స్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇదిలా ఉంటే ఓ వ్యక్తి ఐఫోన్ 15 దక్కించుకునేందుకు ఏకంగా 17 గంటల పాటు క్యూలో నిల్చున్నాడు.

అహ్మదాబాద్ కి చెందిన సదరు వ్యక్తి ముంబై వచ్చి కుర్లాలోని ఆపిల్ స్టోర్ ముందు నిల్చుచున్నాడు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇక్కడే ఉన్నానని, దాదాపుగా 17 గంటల పాటు క్యూలో నిల్చుని ఉన్నానని వెల్లడించారు. ఐఫోన్ల ధరలు మరింత అందుబాటులో ఉండటంతో వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Read Also: Mynampally Hanumanth Rao: బీఆర్ఎస్‌‌కు మైనంపల్లి హనుమంతరావు రాజీనామా

ఐఫోన్ 15ని పొందేందుకు ముంబై, ఢిల్లీ ఆపిల్ స్టోర్ల ముందు లాంగ్ క్యూలు కనిపించాయి. ఆపిల్ తన కొత్త ఐఫోన్ 15 లైనప్ లో నాలుగు మోడళ్లను ప్రవేశపెట్టింది. iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max అందుబాటులో ఉన్నాయి. భారత్ తో పాటు 40 దేశాల్లో ఈ రోజు నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యాయి. 128GB, 256GB, 512GB స్టోరేజ్ కెపాసిటీతో పింక్, గ్రీన్, బ్లూ, ఎల్లో, బ్లాక్ వంటి 5 రంగుల్లో లభ్యమవుతుంది.

128GB బేస్ స్టోరేజ్‌తో iPhone 15 ధర రూ. 79,900 నుండి ప్రారంభమవుతుంది. ఇదేవిధంగా iPhone 15 Plus ధర రూ. 89,900, iPhone 15 Pro ధర రూ. 134,900, iPhone 15 Pro Max 256GB ధర రూ. 159,900 నుండి ప్రారంభమవుతుంది.

Show comments