NTV Telugu Site icon

5G Towers: వారానికి కనీసం 10 వేల 5జీ టవర్లను ఏర్పాటుచేయాలి

5g Towers

5g Towers

5G Towers: టెలీకమ్యూనికేషన్‌ కంపెనీలు ప్రస్తుతం వారానికి 2 వేల 5 వందల 5జీ టవర్లను మాత్రమే ఏర్పాటుచేస్తుండగా ఆ సంఖ్యను వారానికి కనీసం 10 వేలకు పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. ఇప్పటివరకు మొత్తం 8 వేల టవర్లను మాత్రమే ఇన్‌స్టాల్‌ చేశారని, 5జీ మౌలిక సదుపాయాల ఏర్పాటులో టెల్కోలకు ప్రభుత్వం నుంచి పాలసీకి సంబంధించిన ఎలాంటి సపోర్ట్‌ కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే.. 5జీ roll-out స్పీడ్‌ను మాత్రం మెయిన్‌టెయిన్‌ చేయాల్సిందేనని తేల్చిచెప్పారు.

also read: Indian Currency Look: మన దేశ కరెన్సీ లుక్‌ మారనుందా?

టెలికం టవర్స్‌నే బేస్‌ ట్రాన్సీవర్‌ స్టేషన్స్‌ (బీటీఎస్‌) అని కూడా అంటారు. ఏ మొబైల్‌ నెట్‌వర్క్‌కు సంబంధించిన బీటీఎస్‌లో అయినా ఫిక్స్‌డ్‌ రేడియో ట్రాన్సీవర్‌ ఉంటుంది. ఎక్కువ శాతం టవర్ల రూపంలోనే ఉంటుంది. ఇది సబ్‌స్క్రైబర్‌ డివైజ్‌ మరియు టెలికం ఆపరేటర్‌ నెట్‌వర్క్‌ మధ్య వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ రాకపోకలకు వీలు కల్పిస్తుంది. ఇదిలాఉండగా.. 163 హ్యాండ్‌సెట్‌ మోడల్స్‌ని ఓవర్‌-ది-ఎయిర్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌తో ఎనేబుల్‌ చేశామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

ముసాయిదా టెలికం బిల్లుపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు గతంలో విధించిన గడువును అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 10 వరకు పొడిగించొచ్చని తెలిపారు. ఈ లోపు ఇండస్ట్రీ వర్గాలు, సంఘాలు తమ తమ సలహాలను, సూచనలను ఆ తేదీ లోపు అందజేస్తే వాటిని పరిగణనలోకి తీసుకొని బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని చెప్పారు. సంబంధిత స్టాండింగ్‌ కమిటీ ఈ రికమండేషన్లను పరిశీలించి ముసాయిదా బిల్లులో పొందుపరుస్తుందని, అనంతరం మరో డాఫ్ట్‌ బిల్లును కూడా అందుబాటులోకి తెస్తుందని అన్నారు.