NTV Telugu Site icon

OPPO F27 Pro Plus 5G Price: మొదలైన సేల్.. ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్‌పై భారీ డిస్కౌంట్!

Oppo F27 Pro Plus 5g Offers

Oppo F27 Pro Plus 5g Offers

OPPO F27 Pro Plus 5G Sales Starts in Flipkart: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ కంపెనీ ‘ఒప్పో’ ఇటీవల కొత్త 5జీ ఫోన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఎఫ్ సిరీస్‌లో ‘ఒప్పో ఎఫ్‌ 27 ప్రో ప్లస్’ స్మార్ట్‌ఫోన్‌ను జూన్ 13 రిలీజ్ చేయగా.. జూన్ 20 నుంచి అమ్మకాలు మొదలయ్యాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌, ఒప్పో ఆన్‌లైన్‌ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ ఉంది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం.

ఒప్పో ఎఫ్‌ 27 ప్రో ప్లస్ ఫోన్‌ 8జీబీ+128జీబీ వేరయంట్‌ ధర రూ.32,999గా ఉండగా.. ఫ్లిప్‌కార్ట్ 15 శాతం తగ్గింపు అందిస్తోంది. దాంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మీరు రూ.27,999కి కొనుగోలు చేయొచ్చు. అంటే మీరు రూ.5000 ఆదా చేసుకోవచ్చు. ఇక హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లపై 10 శాతం ఇన్‌‌స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అంతేకాదు ఈఎంఐ ఆఫర్ (నెలకు రూ.985) కూడా అందుబాటులో ఉంది.

Also Read: Suryakumar Yadav: అందుకే బబుల్‌ గమ్‌ను ఇంకాస్త గట్టిగా నమిలా: సూర్యకుమార్‌

ఒప్పో ఎఫ్‌ 27 ప్రో ప్లస్ 6.7 ఇంచెస్ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్ 3డీ కర్వ్‌డ్‌ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్‌ రేటుతో 950 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 ప్రొటెక్షన్‌తో ఇది వస్తోంది. డైమెనిసిటీ 7050 ప్రాసెసర్‌ ఉండగా.. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత కలర్‌ ఓఎస్‌తో ఈ ఫోన్ రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనక వైపు 64 ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ సెకండరీ సెన్సర్‌ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందుభాగంలో 8 ఎంపీ కెమెరాను ఇచ్చారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండగా.. 67W సూపర్‌ వూక్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఉంది.

 

Show comments