Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ ‘జొమాటో’(Zomato) శాఖాహారుల కోసం సరికొత్తగా రాబోతోంది. శాఖాహార వినియోగదారుల్ని దృష్టిలో పెట్టుకుని పూర్తిగా ‘ప్యూర్ వెజ్ మోడ్’ని ప్రారంభించింది. వెజిటేరియన్ల కోసం ‘‘ప్యూర్ వెజ్ ప్లీట్’’ ద్వారా డెలివరీలు అందించబడుతాయి. జొమాటో సాంప్రదాయ డ్రెస్ కోడ్‌కి బదులుగా గ్రీన్ యూనిఫాం, గ్రీన్ డెలివరీ బ్యాగ్స్‌ని కలిగి ఉంటుంది. గతంలో వీరికి రెడ్ యూనిఫాం, రెడ్ డెలివరీ బాక్సులు ఉండేవి. ఇప్పుడు ఈ రెడ్ డ్రెస్ కోడ్ నాన్-వెజ్‌కి పరిమితం కానుంది.