Deepinder Goyal: జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ ఎటర్నల్ సీఈఓ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఆయన ఒక పోస్ట్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. నిజానికి 18 ఏళ్ల క్రితం ఆయన స్థాపించిన కంపెనీ సీఈఓ పదవి నుంచి వైదొలగాలని తీసుకున్న ఈ నిర్ణయం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఇదే టైంలో ఆయన తన రాజీనామాకు గల కారణాలను వివరిస్తూ కంపెనీ వాటాదారులకు ఒక లేఖ…