బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవేర్‌నెస్ క్యాంపెయిన్‌ను టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. యువీకి చెందిన స్వచ్ఛంద సంస్థ ‘యూవీకెన్’ బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తోంది. ఈ ఎన్జీవో దేశంలోని మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు యాడ్‌లు చేస్తుంటుంది. తాజాగా యూవీకెన్ చేసిన యాడ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘యువరాజా.. ఇదేం అవేర్‌నెస్ క్యాంపెయిన్’ అంటూ నెటిజెన్స్ మండిపడుతున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు మహిళలు తరచూ తమని తాము పరిశీలించుకోవాలంటూ…