వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంపై సంచలన ఆరోపణలు చేశారు. చిదంబరంను ఓ ఆర్థిక ఉగ్రవాదిగా అభివర్ణించిన సాయిరెడ్డి.. ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయ సాయిరెడ్డి వరుసగా 5 ట్వీట్లు సంధించారు. చిదంబరానికి అసలు నైతికతే లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యాయ కళాశాలలు చిదంబరం వ్యవహారాలను కేస్ స్టడీలుగా తీసుకోవాలని తనదైన రీతిలో వ్యంగ్యాస్త్రాలు…