విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలో ఆదివారం నాడు జుంబా డే నిర్వహించారు. తేజాస్ ఎలైట్ సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమంలో హీరో సంపూర్ణేష్ బాబు, వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతను జుంబా డ్యాన్స్ పట్ల ప్రోత్సహించేందుకు హీరో సంపూర్ణేష్‌తో కలిసి వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ జుంబా డ్యాన్స్ చేశారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్‌ను వైసీపీ ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఇలాంటి ఫిట్ నెస్ ఈవెంట్లు మరిన్ని నిర్వహించాలని, జుంబా డ్యాన్స్…
చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా నిత్యం యాక్టివ్ గా వుంటారు. ఒకవైపు ప్రజాప్రతినిధిగా, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా క్షణం ఖాళీ లేకుండా గడుపుతారు. మధ్యలో జబర్దస్త్ లాంటి కామెడీ షోకి జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని కూడా పంచుతుంటారు. తన స్వంత ఊరు నగరిలో పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఒకవైపు రాజకీయ నేతగా బిజీగా ఉన్నా సామాజిక కార్యక్రమాలకు ఆమె టైం కేటాయిస్తూ ఉంటారు. ఆటల్లోనూ పాల్గొంటూ వుంటారు. బుధవారం…
కడప జిల్లా మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి బీడీ కాల్చారు. సోమవారం నాడు కమలాపురంలో పురపాలిక ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీకి ఓటు వేయాలని ప్రజలను అడుగుతూ ముందుకు సాగిపోతుండగా.. ఓ ఇంట్లో బీడీ తయారీ ప్రక్రియను చూసి మంత్రముగ్ధుడయ్యారు. దీంతో కార్మికుడు తయారుచేసిన బీడీ తీసుకుని నోట్లో పెట్టుకున్నారు. బీడీని అంటించుకుని స్టైలుగా పొగ వదలడంతో అక్కడున్న వైసీపీ నేతలు అవాక్కయ్యారు. Read Also: రాఘవ లారెన్స్ గొప్ప…