Home
Ysrcp Leaders
Ysrcp Leaders News
-
Ambati Rambabu: వైసీపీ కేడర్‌ను భయపెడుతున్నారు.. రౌడీషీట్లపై అంబటి ఆగ్రహం
Ambati Rambabu: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై రౌడీషీట్లు తెరవడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నేతలు పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. వైసీపీ నేతలు, కార్యకర్తలపై రౌడీషీట్లు తెరుస్తూ క్యాడర్‌ను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మరికొందరిని బైండోవర్ చేసేందుకు పోలీసులు పిలుస్తున్నారని, ఈ చర్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కార్యకర్తలను పోలీస్ స్టేషన్లకు పిలవడం, సంతకాల పేరుతో వారిని… -
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
Off The Record : బాపట్ల జిల్లా రేపల్లె పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటాయి. కీలక నియోజకవర్గాల్లో ఒకటి కావడంతో ఇక్కడ పట్టుకోసం టీడీపీ, వైసీపీ… పొలిటికల్ సీజన్‌తో సంబంధం లేకుండా నిత్యం ఎత్తులకు పై ఎత్తులు వేస్తూనే ఉంటాయి. ఇక్కడ గెలుపు కోసం పార్టీ పెట్టినప్పటి నుంచి వైసీపీ ప్రయత్నిస్తున్నా… వర్కౌట్ అవడం లేదు. దాంతో… 2024లో అభ్యర్థిని మార్చి చేసిన ప్రయోగం సైతం విఫలమైంది. దీంతో రేపల్లె మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టిన… -
Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
Off The Record: సింహపురి రాజకీయాల్లో జనసేన వ్యూహం ఆసక్తికరంగా మారుతోంది. పార్టీలో చేరేందుకు నేతలు ఆసక్తి చూపుతున్నా…. అధిష్టానం మాత్రం అంత తొందరొద్దు కాస్త ఆగండని అంటోందట. ఒంగోలులో బాలినేని.. దామచర్ల ఎపిసోడ్ తరువాత.. ఇతర పార్టీల నుంచి తీసుకునే విషయంలో తొందరపాటు వద్దని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. బలోపేతం పేరుతో ఎవరంటే వారిని తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది పడతామన్న భావనలో పార్టీ పెద్దలు ఉన్నట్టు చెబుతున్నారు. అందుకే.. వస్తామన్న వాళ్ళందరికీ కాస్త ఆగండంటూ స్మూత్‌గా చెబుతున్నారట.… -
Off The Record: ఆ 24 మంది ఎవరు? తాడిపత్రిలో జేసీ సంచలన హెచ్చరిక
Off The Record: తాడిపత్రి రాజకీయ రచ్చ, దాని తాలూకు సెగ మరోసారి అనంతపురం జిల్లా కేంద్రాన్ని తాకింది. పోటా పోటీ ఫిర్యాదులతో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, పెద్దారెడ్డి వర్గీయుల మధ్య జరుగుతున్న గొడవలు అందరికీ తెలిసినవే. ఇక్కడ దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న జేసీ కుటుంబానికి 2019ఎన్నికల్లో తొలిసారి ఓటమి ఎదురైంది. వైసీపీ హయాంలోని ఐదేళ్ళు జేసీ కుటుంబ సభ్యుల మీద పలు కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ అప్పట్లో తాడిపత్రి మున్సిపాలిటీని… -
Dharmana Krishnadas: ‘ఈరోజు అప్పలరాజు.. రేపు మేమే’.. కూటమి ప్రభుత్వంపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు
Dharmana Krishnadas: శ్రీకాకుళం జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును మాజీ డిప్యూటీ సీఎంలు ధర్మాన కృష్ణదాస్, బుడి ముత్యాల నాయుడు, మాజీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబుతో పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ములాఖాత్‌లో కలిసి పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని… -
Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
Amaravati Tension: అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఆర్డీఏ పరిరక్షణ బృందం పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్ వద్ద వైసీపీ నేతలు పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు రాజధాని భూములను పరిశీలించేందుకు వెళ్తుండగా, టీడీపీ సానుభూతిపరులు, రాజధాని రైతులు వారిని అడ్డుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా “గో బ్యాక్ వైసీపీ” అంటూ నినాదాలు చేస్తూ నల్ల బ్యాడ్జీలతో ఆందోళన నిర్వహించారు.దీంతో, ఇరువర్గాల మధ్య వాగ్వాదం,… -
Off The Record: తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందా..?
Off The Record: తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌కు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందట. దీన్నుంచి నేను బయటపడలేకపోతున్నానురా… బాబో…. అంటూ సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు సమాచారం. ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్న తలనొప్పులు భరించలేక నానా తంటాలు పడుతుంటే…. కొత్తగా పార్టీ అధిష్టానం ఇస్తున్న ఆదేశాలతో సొంత కులానికి కూడా దూరమయ్యే ముప్పు ముంచుకొస్తోందని తల బాదుకుంటున్నట్టు తెలుస్తోంది. కాపు కులం కేంద్రంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణాలు ఆయన్ని ఇరకాటంలో పడేస్తున్నాయంటున్నారు. ఇటీవల వైసీపీ కాపు… -
Off The Record: పెనుకొండలో మంత్రి వర్సెస్ మాజీ మంత్రి.. మాటల మంటలు..
Off The Record: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాకముందే… ఉమ్మడి అనంతపురం జిల్లాలో వాతావరణం వేడెక్కుతోంది. కొందరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తాడిపత్రి మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి. వీరి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో తాడిపత్రిలో పొలిటికల్ హీట్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. మరోవైపు మేమేం తక్కువ అంటూ ఇద్దరు మహిళా… -
Off The Record: మళ్లీ యాక్టివ్ అయిన చెవిరెడ్డి.. జగన్ కొత్త వ్యూహమా?
Off The Record: చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వైసీపీలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన పార్టీ అధినేత జగన్‌కు నమ్మిన బంటు అని చెప్పుకుంటారు. ఆ క్రమంలోనే… గత ఎన్నికల్లో చెవిరెడ్డిని చంద్రగిరి నుంచి ఒంగోలు పంపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించారు జగన్. గతంలో కాంగ్రెస్‌కు, ఆ తర్వాత వైసీపీకి కంచు కోటలా మారిన ఒంగోలు లోక్‌సభ సీట్లో సునాయాసంగా గెలుస్తారని భావించినా… స్వయంకృతాలతో ఆ స్థానం చేజారింది. పార్టీ ఆవిర్భావం… -
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
Off The Record: 2024 అసెంబ్లీ ఎన్నికల షాక్ నుంచి వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కోలుకుంది. ప్రభుత్వ విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తోంది. కానీ… ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీలో మాత్రం ఒకప్పటి ఉత్సాహం, నాటి పెత్తనాలు కనిపించడం లేదన్న అభిప్రాయం బలంగా ఉంది. మరీ ముఖ్యంగా… పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఇప్పుడు పూర్తిగా మౌనం పాటించడం హాట్ టాపిక్‌గా మారింది. మొన్నటి ఎన్నికల్లో జిల్లా వైసీపీ నేతలంతా ఓడిపోయినా… పెద్దిరెడ్డి కుటుంబం మాత్రం గెలిచింది. కానీ…
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!