GVMC Council Chaos: విశాఖపట్నంలోని జీవీఎంసీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గీతం యూనివర్సిటీ వివాదాస్పద భూముల అంశంపై జరిగిన కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. సమావేశం సందర్భంగా కూటమి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.