CM Jagan Mohan Reddy: కాకినాడ జిల్లా గొల్లప్రోలులో సీఎం జగన్ వైఎస్ఆర్ కాపునేస్తం మూడో ఏడాది నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తమది మనసున్న ప్రభుత్వమని.. మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైఎస్ఆర్ కాపునేస్తం అనే పథకాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ పథకం ద్వారా ప్రతి కాపు, బలిజ, ఒంటరి, తెలగ కుటుంబాలకు చెందిన ప్రతి ఒక్కరికీ తోడుగా ఉంటున్నామని తెలిపారు. వైఎస్ఆర్ కాపునేస్తం ద్వారా మహిళలకు రూ.15వేలు ఇస్తున్నామని..…