ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. వైఎస్సార్ ఆసరా పథకం నిధుల విడుదలకు సమయం ఖరారైంది. ఇవాళ అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్ ఆసరా నాలుగో విడత రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి సీఎం వైఎస్ జగన్ నగదు జమ చేయనున్నారు.