YS Sharmila: వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ముద్దుల తనయుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి ఫిబ్రవరి 17 న ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. వైయస్ రాజారెడ్డి వివాహ వేడుకలు రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఉన్న ఉమైద్ భవన్ లో ఘనంగా జరిగాయి. ఫిబ్రవరి 16 నుండి 18 వరకు నిర్వహించనున్న వివాహ వేడుకలలో భాగంగా 16వ తేదీ సంగీత్ మరియు మెహందీ కార్యక్రమం జరిగింది.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్ లో తన సోదరి షర్మిల కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుకకు సతీసమేతంగా హాజరయ్యారు. వైఎస్ రాజారెడ్డి, ప్రియ అట్లూరి నిశ్చితార్థ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు.
Ys Sharmila Son Rajareddy to Marry Priya Atluri Soon: ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్టు తెలుస్తోంది. చట్నీస్ సంస్థల అధినేత ప్రసాద్ మనవరాలు అయిన ప్రియా అట్లూరి అనే యువతి కూడా పై చదువుల నిమిత్తం అమెరికాలో ఉంటున్న క్రమంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని అంటున్నారు. అయితే చట్నీస్ ప్రసాద్ అనే ఆయనకు…