CM YS Jagan: తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ సంతరించుకుంది.. ఇప్పటికే పట్నం వీడి పల్లె బాట పడుతున్నారు తెలుగు ప్రజలు.. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి తరలివెళ్తున్నారు.. దీంతో, రోడ్లు, రైల్వేస్టేషన్, విమానాలు.. అన్నీ రద్దీగా మారిపోయాయి.. ఇక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం జగన్.. సంక్రాంతి పల్లెల పండుగ.. రైతుల పండుగ.. మన అక్కచెల్లెమ్మల…