రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏనాడూ రాజీ పడలేదు అని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికష్టాలు వచ్చినా.. వైసీపీలో విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేశామన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువతది కీలక పాత్ర అని, పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండడం చాలా ముఖ్యం అని, సమస్య వచ్చినప్పుడు ప్రజలకు తోడుగా నిలబడాలని జగన్ సూచించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో యువజన విభాగం…