టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్.. బ్యాచిలర్స్ కి గురువుగా మారిపోయాడు. పెళ్లి గురించి బ్యాచిలర్స్ కి ఉపదేశాలు ఇచ్చేస్తున్నాడు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం వెకేషన్ మోడ్ లో ఉన్నాడు. కొండలు ఎక్కుతూ, జిమ్ చేస్తూ, బాడీ బిల్డర్ గా మారిపోయి కనిపిస్తున్నాడు. ఇక ఇటీవల కొన్ని ఫొటోల్లో నవదీప్ తెల్ల గడ్డంతో కనిపించాడు. ఇంకేముంది ఈ యంగ్ హీరో అభిమాన సంఘం విచిత్రమైన కామెంట్స్ తో విరుచుకుపడ్డారు.…