విశాఖలో కలకలం రేపిన దువ్వాడ జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు.. దువ్వాడ పీఎస్ పరిధిలో జరిగిన వృద్ధ దంపతుల డబుల్ మర్డర్ కేసులో నిందితుడ్ని అరెస్ట్ చేశారు పోలీసులు.. అప్పు తీర్చాలని అడిగినందుకు యోగేంద్ర బాబు, లక్ష్మీల హత్య చేసినట్లు విచారణలో తేల్చారు పోలీసులు.. మరోవైపు, భీమిలి మండలం దాకమర్రి వివాహిత హత్య కేసును కూడా పోలీసులు ఛేదించారు.. హత్య చేసిన క్రాంతి కుమార్ ను అరెస్టు చేశారు.