Balkampet Yellamma : హైదరాబాద్ బల్కంపేట్‌లోని మహిమాన్విత ఎల్లమ్మ తల్లి కల్యాణోత్సవం ఇవాళ అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల కోసం ఆలయ అధికారులు సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం మొదటి రోజు అమ్మవారిని పెళ్లికూతురిలా అలంకరించి, పుట్ట మన్నుతో ఎస్ఆర్ నగర్ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయం వరకు ఊరేగింపు జరిపారు. ఈ వేడుకను భక్తులు భారీ సంఖ్యలో తిలకించారు.…