వైసీపీ కీలక నాయకులపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్‌తో పాటు వైసీపీ నేతల కుటుంబాలపై ఐ టిడిపి అనే పేరుతో అసభ్య కామెంట్స్ చేస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు.