వైసీపీ కార్యకర్తపై మంత్రి ధర్మాన చేయి చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ధర్మాన ప్రసాదరావు శుక్రవారం నాడు శ్రీకాకుళంలో పర్యటించారు. దాదాపు 8 ఏళ్ల తర్వాత మళ్లీ మంత్రి పదవి చేపట్టిన ధర్మాన ప్రసాదరావును కలిసేందుకు భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మానతో కరచాలనం చేసేందుకు వైసీపీ కార్యకర్తలు పోటీ పడ్డారు. ఈ సమయంలో ఓ వైసీపీ కార్యకర్త మంత్రి ధర్మాన…