విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో టీడీపీ గన్నవరం ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు పర్యటించారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం కార్యకర్తలతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ.. టీడీపీ ప్రకటించిన ఆరు హామీలపై ప్రచారం చేశారు. చంద్రబాబు హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించడంతో పాటు 2024లో అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. అంతేకాకుండా.. స్థానిక సమస్యలపై యార్లగడ్డ ఆరా తీశారు.…
కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను 2024లో గన్నవరం నుంచి పోటీ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.