దేశవ్యాప్తంగా ‘దీపావళి’ పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. పూజలు, నోములు, దీపాలతో యావత్ దేశం ఘనంగా దీపావళి జరుపుకుంది. గురువారం రాత్రి అయితే పటాసుల పేలుళ్లతో దేశం మొత్తం మార్మోగిపోయింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా బాణసంచాను కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అయితే దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఓ వింత ఆచారంను పాటించారు. దోర్నాల మండలం వై.చర్లోపల్లిలో దీపావళి పండుగ సందర్భంగా ఓ వింత ఆచారాన్ని గ్రామస్తులు ఆనవాయితీగా…