అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ కాల్పులు తీవ్ర కలకలం రేపుతోంది. బుధవారం అమెరికాలోని మిన్నియాపాలిస్ నగరంలో చర్చి సేవకు హాజరైన కేథలిక్ పాఠశాల పిల్లలపై దుండగుడు కాల్పులు జరపడంతో 8, 10 ఏళ్ల వయసు గల ఇద్దరు విద్యార్థులు చనిపోగా.. అనంతరం నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు.