మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025లో నేడు కీలక పోరు జరగనుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో రాత్రి 7.30 నుంచి మ్యాచ్ ఆరంభం అవుతుంది. డబ్ల్యూపీఎల్ 2025లో ఇప్పటికే గుజరాత్‌పై రెండుసార్లు గెలిచిన ముంబై.. ఎలిమినేటర్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అంతేకాదు సొంతగడ్డపై ఆడుతుండడం కూడా ముంబైకి కలిసొచ్చే అంశం. హేలీ మాథ్యూస్, నాట్‌సీవర్ బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్, అమేలియా కెర్, యాస్టికా భాటియా వంటి బ్యాటర్లతో…