Indira Gandhi International Airport: ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు మరో ఘనత సాధించింది. ఇప్పటిదే దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో మొదటి స్థానంలో ఉన్న ఢిల్లీ ఎయిర్ పోర్టు.. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో 9వ స్థానంలో నిలిచింది. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) జాబితా ప్రకారం 5.94 కోట్లకు పైగా ప్రయాణికుల రద్దీతో ఢిల్లీ విమానాశ్రయం 2022లో ప్రపంచంలోనే తొమ్మిదవ రద్దీగా ఉండే విమానాశ్రయంగా అవతరించింది.